Breaking News

31 లోగా జియో ట్యాగింగ్‌ చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నాటిన మొక్కలకు ఈనెల 31లోగా జియో ట్యాగింగ్‌ చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా అధికారులతో జియో ట్యాగింగ్‌పై సమీక్ష నిర్వహించారు.

శాఖల వారీగా నాటిన మొక్కలు, ట్యాగింగ్‌ చేసిన వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్య, ఎక్సైజ్‌, మున్సిపల్‌, అటవీ, నీటిపారుదల, వ్యవసాయం తదితర శాఖలు నాటిన మొక్కలకు 100 శాతం జియో ట్యాగింగ్‌ పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

జ్యోతి బా ఫూలే స్ఫూర్తిగా ముందుకు సాగాలి

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అఖిల భారతీయ ప్రజా ...

Comment on the article