Breaking News

రైతు బాగుంటే మనం బాగుంటాం…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనం రైతుల మీద ఆధారపడి బ్రతుకుతున్నామని, రైతు బాగుంటే మనం బాగుంటామని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, పిఏసిఎస్‌ చైర్మన్‌లతో రైస్‌ మిల్‌ అధ్యక్షులు సెక్రెటరీలతో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డైరెక్ట్‌ పర్చేస్‌ ద్వారా మరియు వరి ధాన్యం కొనుగోలు సెంటర్ల ద్వారా వరి ధాన్యం కొంటె రైతుకు లాభం వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. కొనుగోలు ఏజెన్సీలు మెజార్టీ పిఎసిఎస్‌ సొసైటీస్‌ చైర్మన్లు సిఈఓలు వారి సిబ్బంది అందరూ గట్టిగా కష్టపడాల్సిన అవసరముందన్నారు. కొనుగోలు ఏజెన్సీల పాత్ర చాలా ముఖ్యమన్నారు. వారి తర్వాత రైస్‌మిల్లర్స్‌ ఇందులో రా రైస్‌ మరియు బాయిల్డ్‌ రైస్‌ రెండు ఉన్నవి, సుమారు 240 మిల్స్‌ ఈసారి వడ్లు కొనుగోలులో పాల్గొంటున్నారని, వీలైనంత తొందరగా రైస్‌ మిల్‌లో వడ్లను లారీల నుండి అన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.

అధికారులు రవాణా ముందే ప్రణాళికతో వెళ్లాలన్నారు. ఏ రోజు కొన్న వరి ధాన్యం ఆ రోజు సాయంత్రమే మిల్లుకు చేరే విధంగా ప్లాన్‌ చేసుకోవాలన్నారు. సివిల్‌ సప్లై, మార్కెటింగ్‌, రెవిన్యూ, పిఎస్‌సిఎస్‌ గట్టిగా పనిచేయాలన్నారు. కోపరేటివ్‌ డిపార్ట్మెంట్‌ అధికారులందరూ ప్రాపర్‌గా పని చేయాలన్నారు. ఈసారి తరుగు అనేది రూపు మాపాలన్నారు. మంచి ధాన్యాన్ని తీసుకురావాల్సిన బాధ్యత రైతుదని, కనీసం మద్దతుధర 1888 రూపాయలు వస్తుందని నమ్మకం కలగాలన్నారు. వరి కోత మిషన్లు బ్రో వర్డ్స్‌ ని చాలా మంది రైతులు ఆఫ్‌ చేయిస్తున్నారని, హార్వెస్టింగ్‌ మిషన్‌లో బ్లో వర్డ్స్‌ బంద్‌ చేయడంవల్ల తాలు వస్తుందన్నారు.

దీనిపై పిఎసిఎస్‌ చైర్మన్లు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 17 శాతం తేమ ఎఫ్‌ఏక్యూస్‌ నమూనా ప్రకారంగా ఉన్న ధాన్యాన్ని 41 కెజీల బస్తా మిల్లుకు పంపియ్యాలన్నారు. వ్యవసాయ అధికారి రోలు వెరీ వెరీ ఇంపార్టెంట్‌ అన్నారు. డిఏఓ నిజామాబాద్‌లో ఒక కేజీ తరుగు రాకుండా చూసుకోవాలని తెలిపారు. సన్న రకాలు గ్రేడ్‌ ఏ రకంగా కొంటు నామ్‌ రైతులు ఎఫ్‌ఏక్యూ క్వాలిటీ తీసుకొని సెంటర్లకు రావాలన్నారు. తరుగు పెట్టడం అనే వ్యవస్థ రద్దు అయిపోవాలన్నారు. రూల్స్‌ ప్రకారం వెళితే ఇద్దరికీ లాభం అన్నారు.

రైతుకు, మిల్లర్‌కు మిల్లర్స్‌ ప్రైవేట్‌ ట్రేడర్స్‌ అవసరమున్న దాన్యం వీలైనంత వరకు కొనాలని తెలిపారు. రైతులు కొంత ఎక్కువ ధర ఇచ్చి మిల్లర్స్‌ కొనడం ద్వారా రైతు సంతప్తి చెందుతాడని తెలిపారు. మిల్లర్స్‌ కటింగ్‌ అనే మాట ఎత్తడానికి వీల్లేదన్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ సివిల్‌ సప్లయి అధికారులు హ్యాండిల్‌ చేస్తారన్నారు. ఏవో, పిఎసిఎస్‌ చైర్మన్‌ బాధ్యత తీసుకోవాలని, రైతులకు అర్థమైతే ఈ విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఏవో, ఏఈఓ, ఎఫ్‌ఏక్యూ కానీ ధాన్యాన్ని మిల్లుకు పంపరాదని తెలిపారు. ఎఫ్‌ఎఫ్‌క్యూ సర్టిఫికెట్‌ ఉన్న ధాన్యం పంపివ్వాలన్నారు.

ఎఫ్‌ఎక్యూ దాన్యం కేజీ కట్‌ చేసిన మిల్‌ సీజ్‌ చేయాలన్నారు. ఎఫ్‌ఎక్యూ సర్టిఫికెట్‌ ఇవ్వని ధాన్యం రైస్‌ మిల్‌కు పంపిన ఏఇవోను వెంటనే సస్పెండ్‌ చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలన్నారు. సెల్‌ కాన్ఫరెన్సులో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డిఈఓ గోవింద్‌, డిసిఓ సింహాచలం, మెప్మా పిడి రాములు, రైస్‌ మిల్లర్స్‌ అధ్యక్షులు సెక్రెటరీ పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

ధరణి కార్యాలయానికి రూ. 9 లక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న తసీల్ధార్‌లతో ధరణి పై నిజామాబాద్‌ ...

Comment on the article