Breaking News

రైతులను ఇబ్బందిపెడితే చర్యలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మండలం బొర్గం గ్రామం, డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం కలెక్టర్‌ ముందుగా బొర్గం గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ ఏర్పాటు చేసిన వసతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సెంటర్‌లో ముందుగా వాటర్‌, షెడ్‌, తాడిపత్రి, వేయింగ్‌ మిషన్‌, రిజిస్టర్‌ను పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న వరి ధాన్యాన్ని కొలిచే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరి ధాన్యం 445 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి, జిల్లాలోని 247 రైస్‌ మిల్లర్లకు కేటాయించడం జరుగుతుందని, భారత ఆహార సంస్థ వారి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ తేమ 17 శాతం లోపు, తాలు ఒక్క శాతం ఉండాలని, అట్టి ధాన్యం సన్న రకాన్ని ఏ గ్రేడ్‌గా పరిగణించి క్వింటాలుకు రూపాయలు 1888 మరియు కామన్‌ రకానికి 1868 రూపాయలు రైతులకు ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించిందని, జిల్లాలోని రైతు సోదరులందరు పైన పేర్కొన్న నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, రైసు మిల్లర్లకు తరుగు తీసుకునే అవకాశం ఇవ్వకూడదని తెలిపారు.

రైస్‌ మిల్లర్ల యజమాన్యం తరుగు, కడ్త పేరట రైతులను ఇబ్బందులకు గురి చేస్తే అటువంటి రైస్‌ మిల్లర్లను సీజ్‌ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద చెన్ని మిషన్‌ పెట్టాలని, రైతులు వారి ఇష్టం మేరకు చెన్ని పట్టి ఇవ్వడం జరుగుతుందని, చెన్ని పట్టి ఇచ్చిన వారికి ఎట్టి పరిస్థితిలో తరుగు తీయవద్దన్నారు. హమాలీలు, రవాణా సౌకర్యం ఆలస్యం కాకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కొనుగోలు చేసిన వరి దాన్యాన్ని వెంటనే రైస్‌ మిల్లర్లకు పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, అగ్రికల్చర్‌ అధికారులు, డిసిఓ సింహాచలం, సివిల్‌ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

ధరణి కార్యాలయానికి రూ. 9 లక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న తసీల్ధార్‌లతో ధరణి పై నిజామాబాద్‌ ...

Comment on the article