Breaking News

రక్తదానం చేసిన ఉపాధ్యాయుడు

కామారెడ్డి  అక్టోబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్నూర్‌ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన సంధ్య 25 సంవత్సరాల వయసు కలిగిన మహిళ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అఖిల వైద్యశాలలో రక్త హీనతతో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కామారెడ్డి పట్టణం వివేకానంద కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వంశీధర్‌ సహకారంతో బి పాజిటివ్‌ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు.

రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. గత నాలుగు నెలల కాలంలోనే 300 లకు పైగా యూనిట్ల రక్తాన్ని, 37 మందికి ప్లాస్మాను సకాలంలో అందించడం జరిగిందని, అత్యవసర పరిస్థితుల్లో యువత రక్తదానం చేసి ప్రాణాలు కాపాడడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పింజర్ల సురేష్‌ రెడ్డి, టెక్నీషియన్‌ ఏసుగౌడ్‌ పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article