Breaking News

జిల్లాలో 35 మొన్నజొన్న కొనుగోలు కేంద్రాలు

కామారెడ్డి, అక్టోబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మొక్కజొన్నల కొనుగోలుకు ప్రభుత్వం 35 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం తన చాంబర్‌లో అధికారులతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతుల నుంచి మొక్కజొన్నలను అధికారులు కొనుగోలు చేయాలని సూచించారు.

దళారుల వద్ద మొక్కజొన్నలు కొనుగోలు చేయవద్దని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మొక్కజొన్నలను ఇక్కడ కొనుగోలు చేయకూడదని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, జిల్లా వ్యవసాయ అధికారిని సునీత, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

జ్యోతి బా ఫూలే స్ఫూర్తిగా ముందుకు సాగాలి

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అఖిల భారతీయ ప్రజా ...

Comment on the article