Breaking News

రెండురోజులు ఆన్‌లైన్‌ వర్క్‌షాప్‌

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం వక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో, ఇండియన్‌ అకడమి ఆఫ్‌ సైన్సెస్‌, బెంగళూరు, ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమి, న్యూఢిల్లీ మరియు ది నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌, అలహాబాద్‌ వారి సౌజన్యంతో ”కోవిడ్‌-19: బేసిక్‌ టు క్లినికల్‌” అనే అంశంపై డిసెంబర్‌ 9,10 న రెండు రోజుల అంతర్జాల కార్యశాలను నిర్వహిస్తున్నట్లు కార్యశాల కో-ఆర్డినేటర్‌ డా. అహ్మద్‌ అబ్దుల్‌ హలీంఖాన్‌ తెలిపారు.

ఇందులో డా. అఖిల్‌ బెనర్జీ, కేరళ, డా. దీపక్‌ మోది, ముంబయి, డా. నిషిగంధ నాయక్‌, ముంబయి, డా. యోగేష్‌ సౌచే, పూణే, మరియు డా. వినీత దేశముఖ్‌, ముంబయి వక్తలుగా వుంటారన్నారు. కార్యశాలకు డా. తర్లా నాందేడ్కర్‌, రిటైర్డ్‌ డిప్యుటి డైరెక్టర్‌, నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఫర్‌ రెప్రొడక్టీవ్‌ హెల్త్‌, ముంబయి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని, కార్యశాలలో డిగ్రీ, పీజీ విద్యార్థిని విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొని సద్వినియోగపరుచుకోవాలన్నారు.

దీనికి సంబంధించిన కరపత్రాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం విడుదల చేశారు. ఇందులో వక్షశాస్త్ర విభాగాదిపతి డా. అహ్మద్‌ అబ్దుల్‌ హలీంఖాన్‌, ఆచార్య బి.విద్యావర్ధిని, బివోఎస్‌ డా.ఎమ్‌.అరుణ, డా.దేవరాజు శ్రీనివాస్‌, డా.వి.జలంధర్‌ పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

టియులో రిపబ్లిక్‌ డే పరేడ్‌ ఎంపిక పోటీలు

డిచ్‌పల్లి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) విభాగం ...

Comment on the article