Breaking News

ధరణి పోర్టల్‌తో సులభతరం

కామారెడ్డి, నవంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేయడం సులభతరంగా మారిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కామారెడ్డి సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో ధరణిలో రిజిస్ట్రేషన్‌ చేసే ప్రక్రియ పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేసి వెంటనే కొన్న వారి పేరుతో రికార్డులు మార్పు చేసి కొత్త పాస్‌ పుస్తకం నకలు కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల 59 వేల మంది వివరాలు ధరణి వెబ్‌సైట్‌లో నమోదైనట్లు చెప్పారు.

అక్టోబర్‌ 29న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెబ్‌సైట్‌ ప్రారంభించారని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో 39 మంది స్లాట్‌ బుకింగ్‌ ద్వారా రిజిస్ట్రేషన్లకు నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరిలో ఇద్దరివి కామారెడ్డి రెవెన్యూ కార్యాలయంలో అమ్మకం దారులు, కొనుగోలు దారుల సమక్షంలో రిజిస్ట్రేషన్‌ చేయడం జరిగిందని పేర్కొన్నారు. భూమి విక్రయించిన రైతు పాస్‌ పుస్తకంలో భూమిని తగ్గించి, కొనుగోలు చేసిన వ్యక్తి పాస్‌ పుస్తకంలో భూమి వివరాలు నమోదు చేస్తారని చెప్పారు.

అవినీతి రహితంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. మీ సేవ ద్వారా గాని, సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయానికి వచ్చి గాని దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. రికార్డులను వెంటనే పరిశీలించుకునే అవకాశం ఉందని చెప్పారు. అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, తహసీల్దార్‌ అమీన్‌ సింగ్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article