నిజామాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లెలు పరిశుభ్రంగా ఆకుపచ్చగా ఉండేలా చూడవలసిన బాధ్యత గ్రామ మండల స్థాయి అధికారులదని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా గ్రామ మండల స్థాయి అధికారులతో నర్సరీల్లో సీడ్లింగ్, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు అవెన్యూ ప్లాంటేషన్ శానిటేషన్ ఆప్ తదితర అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి నర్సరీలో ఆయా గ్రామాలకు అవసరమయ్యే 20 వేల మొక్కలను పెంచడానికి ...
Read More »Daily Archives: November 3, 2020
ఆర్టిసి బస్సులు నడపాలి
నిజామాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ, పీజీ కాలేజీకి మరియు నూతన కలెక్టరేట్‌కి ఆర్టీసీ సిటీ బస్సులను నడపాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) ఆధ్వర్యంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యూ జిల్లా నాయకురాలు ప్రత్యూష మాట్లాడుతూ ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ, పీజీ కాలేజీలో చదివే విద్యార్థులు గ్రామీణ పేద, మధ్యతరగతి విద్యార్థులని, వీరు నిత్యం కాలేజీకి రావడానికి గ్రామాల నుండి ప్రధాన బస్ స్టాండ్ వచ్చి, ...
Read More »9 నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు
కామారెడ్డి, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 9 నుంచి మద్నూర్ లో రెండు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రైతులందరూ పత్తిని విక్రయించు కోవచ్చని సూచించారు. ఈనెల 17 నుంచి నాలుగు పత్తి కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేపడతాయని పేర్కొన్నారు. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పి.యాది రెడ్డి, జిల్లా వ్యవసాయ ...
Read More »అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
కామారెడ్డి, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలులో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ హెచ్చరించారు. కామారెడ్డి జనహితలో మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజువారీగా కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలని కోరారు. కొనుగోలు కేంద్రానికి రాగానే రైతు పేరును ఏఈఓలు నమోదు చేసుకోవాలని, వరుసక్రమంలో టోకెన్లు ఇచ్చి కొనుగోలు చేయాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలు పాటించి కొనుగోళ్లు ...
Read More »విస్తృతంగా ఆరోగ్య సూత్రాల ప్రచారం…
కామారెడ్డి, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కామారెడ్డి పట్టణంలో కోవిడ్ 19నివారణకు, నియంత్రణకు పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు గురించి విస్తతంగా ప్రచారం చేశారు. కాకతీయ నగర్, విద్యానగర్, దేవనపల్లిలో మాస్కులు పంపిణీ చేశారు. డిఎం హెచ్‌వో డాక్టర్ పి.చంద్రశేఖర్ సూచనలను అనుసరించి డిప్యూటి డిఎం అండ్ హెచ్‌వో నాగరాజ్, సంజీవరెడ్డి, ఎం.రాణి ప్రచారం చేశారు.
Read More »రెండు మూడు రోజుల్లో మరింత సులభతరం
నిజామాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండు మూడు రోజుల్లో ధరణి పోర్టల్ ద్వారా నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్లు చేయడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం ఇందల్వాయి మండల కేంద్రంలో కలెక్టర్ తహసిల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను, ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం 23 కు గాను 19 స్లాట్స్ పూర్తి చేశారని, మంగళవారం 25 స్లాట్స్ ...
Read More »కొత్త ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జిల్లాకు వచ్చారు
నిజామాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మంగళవారం జిల్లాకు కొత్తగా బదిలీపై వచ్చిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కె. సాయి రమా దేవిని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్చం అందజేశారు.
Read More »చర్చలు సఫలం…
నిజామాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హమాలీల బస్తా రేటు క్వింటాలుకు 18 రూపాయల నుండి 23 రూపాయలకు పెంచుకోవడంతో పాటు, దసరా ఇన్సెంటివ్ను ఆరువేల రూపాయలు, ఈఎస్ఐ మరియు ఇన్సూరెన్స్ సౌకర్యం, స్వీపర్లకు ప్రస్తుతం ఇస్తున్న వేతనం మీద 1750 రూపాయలు అదనంగా పెంచుకోవడంతో పాటు హమాలీలకు ఇస్తున్న పద్ధతులు సౌకర్యాల్ని సాధించుకోవడం జరిగిందని ఏఐటీయూసీ సివిల్ సప్లై కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.ఓమయ్య తెలిపారు. మంగళవారం ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల ...
Read More »వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం పోరాడుదాం
బోధన్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యవసాయాన్ని బడా కార్పొరేట్లకు అప్పజెప్పే మోదీ నాయకత్వంలోని బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా రైతులతో పాటు ప్రజలందరూ ఐకమత్యంతో పోరాడాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి మల్లేష్ పిలుపు నిచ్చారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామంలో రైతులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశం ఒక వైపున కరోనా మహమ్మారినీ, మరో వైపునా దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకు పోతున్న ...
Read More »మినీ ట్యాంక్‌బండ్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
నిజామాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరం రఘునాథ చెరువు వద్ద నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనులను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్ ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరడానికి రఘునాథ చెరువు వద్ద నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, తెలంగాణలో ఉన్న మినీ ట్యాంక్ బండ్లకి తీసిపోని విధంగా మంచి గ్రిల్స్ , ప్లాంటేషన్స్తో సుందరంగా ...
Read More »