Breaking News

డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక

డిచ్‌పల్లి, నవంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలోని డిగ్రీ ఇయర్‌ వైస్‌ బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ, బిఎ (ఎల్‌) కోర్సులకు చెందిన మొదటి, రెండవ మరియు మూడవ సంవత్సరాల బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు ఈ నెల 9 నుంచి 28 వ తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో షెడ్యూల్‌ విడుదల చేశారు.

కావున డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, బ్యాక్‌ లాగ్‌ విద్యార్థులు గమనించగలరని ఆయన కోరారు. పూర్తి వివరాలకు యూనివర్సిటి వెబ్‌ సైట్‌ సంప్రదించవలసిందిగా సిఓఇ సూచించారు.

Check Also

రేపట్నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు బంద్‌

హైదరాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్కూళ్ల మూసివేతపై తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ...

Comment on the article