నిజామాబాద్, నవంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణదారులు తప్పక పోలీస్ అనుమతి తీసుకోవాలని పోలీసు కమీషనర్ కార్తికేయ వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో తెలంగాణ గెజిట్ ప్రకారంగా జి.ఓ నెంబర్ : 163 ప్రకారంగా పోలీస్ కమీషనరేట్ అప్‌గ్రేడ్ అయినందున దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలికంగా టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసేవారు తప్పకుండా సంబం దిత ఎ.సి.పి నుండి అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు.
దానికి సంబంధించిన సమాచారం కోసం సంబందిత డివిజన్ స్థాయి అధికారులను సంప్రదించాలన్నారు. సంబందిత ఎ.సి.పి స్థాయి అధికారి అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలను నెలకొల్పి నట్లయితే వారిపై ఎక్స్ ప్లోజివ్ యార్డు 1884 రూల్ 1933 సవరణ 2008 ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. టపాకాయల దుకాణాలు సంబందిత కళ్యాణ మండపాలు, భాళీ ప్రదేశాలలో నెలకొల్పాలని, అట్టి కళ్యాణ మండపం లేదా ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్.ఓ.సి సర్జిఫికేటు పొందపర్చాలన్నారు.
షాపుకు – షాపుకు మధ్య వ్యత్యాసం 3 మీటర్లు మరియు రెసిడెన్షియల్ / గహ నిర్మాణాలకు 50 మీటర్ల దూరంలో ఉండాలని సూచించారు. ప్రతీ చోట 50 షాపులకు మించరాదని, జనరద్దీగల ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపుల ఏర్పాటు చేయరాదన్నారు. తాత్కాలిక టపాకాయల దుకాణాలలో ఫైర్‌కు సంబంధించిన జాగ్రత్తలు తప్పక పాటించేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారం పోలీసు వెబ్సైట్లో ఆన్లైన్లో ఏర్పాటు చేయడం జరిగిందని, దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని వివరాలు పొందుపర్చి, సంబంధిత ఎ.సి.పి ఇచ్చి అనుమతి పొందాలన్నారు. ప్రతీ ఒక్కరు కోవిడ్ – 19 నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021