అట్రాసిటీస్‌ కేసులు త్వరగా పరిష్కరించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అట్రాసిటీస్‌ కేసులు త్వరగా పూర్తిచేసి వారికి నిర్ణీత సమయంలో న్యాయం జరిగే విధంగా, పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పోలీసు, సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో జిల్లాస్థాయి అట్రాసిటీస్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది.

అట్రాసిటీ కేసులు 2011 నుండి 2018 వరకు 95 కేసులు వచ్చాయని, వాటిలో పోక్సో చట్టం క్రింద 40 కేసులు, అత్యాచార కేసులు 6 వచ్చాయని, వరకట్నం కేసులు 39, కిడ్నాప్‌ కేసులు 10, అదేవిధంగా 2019-20 కు సంబందించిన కేసులు మొత్తం 255 వచ్చాయన్నారు.

బాధితులకు పోలీస్‌ శాఖ నుండి వచ్చిన నివేదికలకు అనుగుణంగా వెంటనే నష్టపరిహారం చెల్లించటానికి చర్యలు తీసుకోవాలని, సత్వరంగా న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులందరు పాల్గొన్నారు.

Check Also

అనాధ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శిశు గహ, బాల సదన్‌ గహాల్లో గల అనాధ ...

Comment on the article