Breaking News

తండావాసులకు శుభవార్త

కామారెడ్డి, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ ద్వారా గజ్యానయక్‌ తాండ గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షల రుపాయలు మంజూరు చేయించినందుకు కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని గ్రామ సర్పంచ్‌ హంజీనాయక్‌ తెలిపారు.

కార్యక్రమంలో మాచారెడ్డి జెడ్పీటీసీ మినుకురి రాంరెడ్డి, మాచారెడ్డి మండల పార్టీ అద్యక్షులు హంజీనాయక్‌, కామారెడ్డి యం.పి.పి పిప్పిరి ఆంజనేయులు, మదుసుదన్‌ రావు, గోపాల్‌ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ షేక్‌ అజీజ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రాజగౌడ్‌, గజ్యానయక్‌ తాండ ఉపసర్పంచ్‌ తోకల కిషన్‌, సలీం, సోమారంపేట్‌ గ్రామ ఉపసర్పంచ్‌ సుశాంత్‌, కాకుల గుట్ట తాండ ఉపసర్పంచ్‌ నరేష్‌ అంభర్‌ సింగ్‌ పాల్గొన్నారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article