Breaking News

మద్దతు ధర లేక పంట తగులబెడుతున్నారు

కామారెడ్డి, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం భారత కమ్యునిస్ట్‌ పార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో కామారెడ్డి కౌన్సిల్‌ నిర్వహించారు. సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ మాట్లాడారు. ఈనెల 26 న జరిగే సార్వత్రిక సమ్మెకు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 26న జరిగే బందుకు సిపిఐ కామారెడ్డి జిల్లా మండల గ్రామాల మద్దతు ఇవ్వాలన్నారు.

ధరణి పేరుతో ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో రైతులను పేదప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రైతులకు మద్దతు ధర లేక పండించిన పంటను సైతం తగల పెడుతున్నారని, రైతు పండించిన సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు 2500 రూపాయలు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నారు

కార్యక్రమంలో సిపిఐ సీనియర్‌ నాయకులు వి.ఎల్‌.నర్సింహారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి దశరథ్‌, జిల్లా నాయకులు శేఖర్‌, సుదాకర్‌ రెడ్డి, బండారి రాజిరెడ్డి, కుచాన్‌ శ్రీనివాస్‌, శ్యామల, రాజమణి, భూమన్న, ఈశ్వర్‌, రాజు, తదితరులున్నారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article