Breaking News

ఘనంగా బోనాల పండుగ వేడుకలు

నిజామాబాద్‌, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని కోటగల్లీ మైసమ్మ వీధి మున్నూరు కాపు సంఘం తర్ప ఆధ్వర్యంలో ఆదివారం బోనాల (కడల) పండుగ ఘనంగా నిర్వహించారు. ఉదయం కోటగల్లీ మైసమ్మ వీధిలోగల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున్న బోనాల పండగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

మహిళలతో పాటు పురుషులు సైతం బోనాలు (కడలు) నెత్తిన ఎత్తుకుని మైసమ్మ వీధి నుండి పోచమ్మ గల్లీలోని పెద్దపోచమ్మ ఆలయానికి డప్పు వాయిద్యాలతో పాదయాత్ర నిర్వహించారు. పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పోచమ్మకు మేకలను బలిచ్చారు. ప్రతి సంవత్సరం గ్రామ దేవతలకు కడల పండగతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, అంతేకాకుండా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమద్ధిగా ఉండాలని, వర్షాలు పుష్కలంగా కురువాలని బోనాల పండుగ నిర్వహించుకోవడం జరుగుతుందని మున్నూరు కాపు సంఘం కుల పెద్దలు తెలిపారు.

కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ఆకుల లింగం, కార్యదర్శి వరాల రాజు, కోశాధికారి కొడిగేల భూపతి, ఆకుల మల్లేష్‌, ఆకుల మల్లయ్య, పబ్బు చిన్న చిన్నయ్య, అంగిరేకుల సాయిలు, పుప్పాల రవి, పబ్బు భూమేష్‌, సోమినేని రాజన్న, పుప్పాల రాజు, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Check Also

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని ...

Comment on the article