నిజామాబాద్, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యవసాయ అధికారులు నాణ్యమైన ధాన్యాన్ని ధ్రువీకరణ చేసిన తర్వాత కూడా మిల్లర్లు కడ్తా తీస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు. అధికారులు ఈ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదివారం క్యాంప్ ఆఫీస్ నుండి వ్యవసాయ, సహకార, రెవెన్యూ, సివిల్ సప్లైస్, డిఆర్డిఓ, తదితర అధికారులతో సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని రైతులకు ధాన్యం సేకరణపై మరియు ఇతర విషయాలపై మెసేజ్ ఇచ్చారు. జిల్లాలో సేకరించే ఎఫ్ఎక్యూ ధాన్యానికి కడ్తా లేకుండా తీసుకునే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళుతుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. పంటను కోసే ముందు హార్వెస్ట్ మిషన్లలో సరైన ఏర్పాట్లు చేసుకోవాలని అంటే మిషన్ వేగం ఏ2 లేదా ఏ3 లో బ్లోవర్ వేగం 19 లేదా 26 లో ఉంచి కోతకు వెళ్లాలని తద్వారా ఎఫ్ఏక్యూ దాన్యం రావడానికి వీలు కలుగుతుందన్నారు.
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించి వ్యవసాయ అధికారులు నాణ్యమైన ధాన్యం ఉన్నట్లయితే ఎఫ్ఎక్యు ధ్రువీకరణ ఇస్తారని, నాణ్యత సరిగా లేకుంటే కడ్తా ఎంత తీసుకోవాలో సూచిస్తారని తెలిపారు. వర్షాలు తదితర కారణాల వల్ల నాణ్యత తక్కువగా ఉంటే అందులో 5 శాతానికి మించి నాణ్యత తగ్గదని, ఐదు లేదా పది శాతం ధాన్యానికి మాత్రమే చెన్ని పట్టే అవకాశం ఉంటుందని తెలిపారు.
అందువల్ల రైసు మిల్లర్లు కూడా వ్యవసాయ అధికారుల ధ్రువీకరణ ఆధారంగా ధాన్యాన్ని తీసుకోవాలని అంతకుమించి కడ్తా తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఈ విషయంలో అవసరమైతే కొనుగోలు కేంద్రం బాధ్యులు, ఇతరులపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులపై కూడా శాఖాపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
తమ ధాన్యాన్ని ఇచ్చిన రైతులు తమకు అన్యాయం జరిగినట్లు భావిస్తే జిల్లా యంత్రాంగం కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్ లేదా వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఆయన రైతులకు సూచించారు. కావున ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అందిస్తున్న అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకొని, చెన్ని పట్టుకొని, వీలైనంత త్వరగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని, కొనుగోలు కేంద్రాలకు సహకరించాలని, తమ ధాన్యానికి సరైన నాణ్యత ఉండేలా చూసుకోవాలని అదేవిధంగా న్యాయమైన ధర వచ్చే విధంగా చూసుకోవాలని ఆయన కోరారు.
ట్యాబులో ఓపిఎంఎస్ ఎంట్రీస్ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సెంటర్ ఇంఛార్జిలను ఆదేశించారు. జిల్లా అధికారులు ఏసి, డిసివో, డిఎం సిఎస్, డిఎస్వో, డిఆర్డిఓ, మెప్మా పిడి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించుకుంటూ రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు ఫోన్ నెంబర్లు 18004256644 (టోల్ ఫ్రీ) 7382609775 (వాట్సాప్ సోమవారం నుండి) రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని నాణ్యమైన ధాన్యానికి న్యాయమైన ధరను పొందాలని కోరారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021