Breaking News

Daily Archives: November 11, 2020

కొనుగోలు కేంద్రాల వద్ద ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు..

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం ఇచ్చే క్రమంలో రైతులు తన హమాలీలకు మినహా ఇంకా ఏ రకమైన పనులకు కానీ వ్యక్తులకు కానీ డబ్బులు ఇవ్వవద్దని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ధాన్యం కొనుగోలు కార్యక్రమాలకు సంబంధించి మండల ప్రత్యేక అధికారులకు సంబంధిత శాఖల అధికారులకు సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా పలు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు లారీ డ్రైవర్‌కు కానీ యజమానులకు కానీ కొనుగోలు కేంద్రాల నిర్వహణ ...

Read More »

లక్ష్మీపూజలు ఎప్పుడు…

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ సంవత్సరం లక్ష్మీపూజలు ఎప్పుడు నిర్వహించాలి, అదేవిధంగా నోములు, వ్రతాలు ఎప్పుడు ఇచ్చుకోవాలనే విషయంలో పండితులు ఒక స్పష్టమైన వివరాలు తెలియజేశారు, అవి మీ కోసం… శ్రీ శార్వరీ నామ సంవత్సరం ఆశ్వీయుజ బహుళ చతుర్ధశి 14.11.2020 శనివారం రోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు, 8 గంటల నుండి దీపావళి హారతులు నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే శనివారం సాయంత్రం లక్ష్మీపూజలు నిర్వహించాలని చెప్పారు. అదేవిధంగా 15వ తేదీ ...

Read More »

సమస్యలు లేకుండా కొనుగోలు కొనసాగుతుంది…

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నిన్నటి వరకు ఒక లక్ష 13 వేల 258 మెట్కిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 12 వేల మంది రైతుల ఖాతాలోకి 102 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 21 ఐకెపి, 9 ఎఎంసి, 302 ప్యాక్స్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కలిపి మొత్తం 332 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సోమవారం వరకు ఒక లక్షా 13 ...

Read More »

ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోండి…

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2020-21 విద్యా సంవత్సరానికి కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ / ఎయిడెడ్‌ / ప్రైవేటు కళాశాలలో చదువుచున్న అర్హులైన యస్సీ, యస్టీ, బీసీ, ఇబిసి, మైనారిటీ మరియు డిసాబుల్డ్‌ విద్యార్థిని విద్యార్థులు ఫ్రెష్‌ మరియు రెనివల్‌ ఉపకారవేతనముల కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ /ఎయిడెడ్‌ పాఠశాలలలో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే పెడ్యూల్డ్‌ కులాల విద్యార్థిని ...

Read More »

మహేశ్వర్‌ కుటుంబానికి రూ. 50 లక్షలు

సైన్యం లాంఛనాలతో వీర జవాన్‌ అంత్యక్రియలు పూర్తి ఆర్మూర్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత శనివారం రాత్రి టెర్రరిస్టులతో పోరాటంలో వీరమరణం పొందిన జవాన్‌ ర్యాడ మహేశ్వర్‌ అంత్యక్రియలు మిలిటరీ ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. మంగళవారం రాత్రి వీర జవాన్‌ స్వగ్రామమైన వేల్పూర్‌ మండలం కోమన్‌ పల్లి గ్రామానికి ఆయన మతదేహాన్ని తీసుకురాగా బుధవారం రాష్ట్ర రోడ్లు – భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ ...

Read More »

పరీక్ష తేదీల్లో మార్పు

డిచ్‌పల్లి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న పీజీ ఎం.ఎ. హిందీ నాల్గవ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ మరియు మొదటి, రెండవ, మూడవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షల్లో మార్పులు జరుగనున్నాయని పరీక్షల నియంత్రణాధికారి డా.పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. 13 వ తేదీ జరిగే పరీక్ష 17 వ తేదీ నాడు, 17 వ తేదీన జరిగే పరీక్ష 23 తేదీన జరుగుతాయని ఆయన తెలిపారు. యూజీసీ నెట్‌ హిందీ సబ్జెక్ట్‌ ...

Read More »