Breaking News

Daily Archives: November 16, 2020

రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి నష్టం కలిగించే మూడు చట్టాలను తీసుకొచ్చిందని వాటిని వెంటనే ఉపసంహరించు కోవాలని, ఈ చట్టాలు రైతాంగాన్ని దెబ్బ తీసి, బడా కార్పొరేట్లకు మేలు చేసేలా ఉన్నాయని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు. సోమవారం భిక్కనూరు మండల కేంద్రంలో రైతు గోస ధర్నా నిర్వహించి సిఎం దిష్టిబొమ్మ దగ్దం చేశారు. అనంతరం షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుందని ...

Read More »

లక్ష్యానికి అనుగుణంగా కొనుగోలు చేపట్టాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రతిరోజు ధాన్యాన్ని లక్ష్యానికి అనుగుణంగా కొనుగోలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కామారెడ్డి జనహితలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో అధికారులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలో తీసుకున్న ధాన్యాన్ని రైతుల పేర్లు, విక్రయించిన ధాన్యం వివరాలను ట్యాబులో 90 శాతం నమోదు చేయాలని సూచించారు. మండల స్థాయి పర్యవేక్షణ అధికారులు కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. కేంద్రాలలో ట్యాబ్‌లో వివరాలు నమోదు చేయకపోతే సంబంధిత అధికారులపై ...

Read More »

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల వారోత్సవాల గోడ ప్రతులను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ శరత్‌ సోమవారం ఆవిష్కరించారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కషి చేయాలని కోరారు. ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకోవడానికి పిల్లల నేస్తం 1098 నెంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. హక్కుల పరిరక్షణకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో డిడబ్ల్యూవో అనురాధ, సిడిపిఓ స్రవంతి, పోషణ అభియాన్‌ కోఆర్డినేటర్‌ స్వరూప, అధికారులు సవిత, సౌమ్య, ఆమని, ...

Read More »

ధాన్యం డబ్బులు వేగవంతంగా చెల్లించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరుగాలం కష్టించి ధాన్యాన్ని అందించిన రైతుకు ధాన్యం డబ్బులు చెల్లించే ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యతను పరిశీలించి వెంట వెంట తూకం వేయడం, రైస్‌ మిల్లులకు పంపించడం, అక్కడ వెంటనే ధాన్యాన్ని దించుకునే విధంగా రైస్‌ మిల్లుల వద్ద ఏర్పాటు చేయాలని, రవాణా ...

Read More »

నర్సరీలలో విత్తనాల పనులు వెంటనే పూర్తి చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని మున్సిపాలిటీలలో లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలలో విత్తనాలు వేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా మున్సిపాలిటీలలో హరితహారం కొరకు విత్తనాలు వేయడంపై మున్సిపల్‌ కమిషనర్లతో మాట్లాడారు. హరితహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దష్టితో పర్యవేక్షణ చేస్తున్నారని జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలను సిద్ధం చేసుకొని వాటిల్లో వచ్చే సంవత్సరంలో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడానికి అవసరమైన ...

Read More »

నిరుపేదలకు రగ్గుల పంపిణీ

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సహారా ఆద్వర్యంలో నిజామాబాదు నగరంలోని నిరాశ్రయులైన నిరుపేదలకు ఆదివారం రాత్రి రగ్గులు పంపిణీ చేశారు. నగరంలోని రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, గాంధీచౌక్‌, కంఠేశ్వర్‌, పూలాంగ్‌ తదితర ప్రాంతాల్లో చలికి వణుకుతూ ఇబ్బందులు పడుతున్న వారికి రగ్గులు అందజేశారు. ఈ సందర్బంగా లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సహారా అధ్యక్షుడు ఉండవల్లి శివాజి మాట్లాడుతూ చలి తీవ్రత పెరిగిన దష్ట్యా తమ క్లబ్‌ ఆద్వర్యంలో పేదలకు రగ్గులు పంపిణీ చేశామని చెప్పారు. ప్రతీ ...

Read More »

అభివృద్ధి పనులు ఆగకూడదు

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్న చిన్న కారణాలతో అభివృద్ధి పనులు ఆగకుండా వెంటనే పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వాటికి అవసరమైన ఇసుక, స్థల సేకరణ సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌ నుండి సంబంధిత అధికారులతో ఎంపీ లాడ్స్‌, సిడిపి, ఎస్‌డిఎఫ్‌, రూర్బన్‌ పనుల అభివద్ధిపై సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014- 15 సంవత్సరం నుండి ఇంకా ...

Read More »

అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు విద్యార్థి సంఘాలు భయపడవు

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగునాడు విద్యార్థి సమైక్య, తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆస్తులకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి జిల్లా నాయకుడు కుంభాల లక్ష్మణ్‌ యాదవ్‌ మాట్లాడుతూ కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన భూమిని కొందరు కబ్జా చేయాలనే ఆలోచనతో ఉన్నారని అటువంటి ఆలోచనను విరమించుకోవాలని లేకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధతం చేస్తామన్నారు. గతంలో ...

Read More »

సమ్మె విజయవంతం చేయాలి

బోధన్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలోని మోడి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులపై దాడికి పూనుకుంటున్నదని, వాటికి నిరసన 26న జరిగే సమ్మె విజయ వంతం చేయాలని తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర కమిటి నాయకులు మల్లేష్‌ పిలుపు నిచ్చారు. సోమవారం ఉదయం బోధన్‌ పట్టణంలో మున్సిపాలిటిలో వాటర్‌ విభాగంలో పనిచేసే కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హాక్కులను అమలు చేయక పోవడమే కాక వున్న ...

Read More »