Breaking News

నిరుపేదలకు రగ్గుల పంపిణీ

నిజామాబాద్‌, నవంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సహారా ఆద్వర్యంలో నిజామాబాదు నగరంలోని నిరాశ్రయులైన నిరుపేదలకు ఆదివారం రాత్రి రగ్గులు పంపిణీ చేశారు. నగరంలోని రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, గాంధీచౌక్‌, కంఠేశ్వర్‌, పూలాంగ్‌ తదితర ప్రాంతాల్లో చలికి వణుకుతూ ఇబ్బందులు పడుతున్న వారికి రగ్గులు అందజేశారు.

ఈ సందర్బంగా లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సహారా అధ్యక్షుడు ఉండవల్లి శివాజి మాట్లాడుతూ చలి తీవ్రత పెరిగిన దష్ట్యా తమ క్లబ్‌ ఆద్వర్యంలో పేదలకు రగ్గులు పంపిణీ చేశామని చెప్పారు. ప్రతీ సంవత్సరం రగ్గులు పంపిణీ చేస్తామన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ఇబ్బందుల పాలైన పేదలకు నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేశామని వివరించారు.

లయన్స్‌ తేజస్వీ రీజియన్‌ చైర్మెన్‌ అంకం లక్ష్మణ్‌ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లయన్స్‌ క్లబ్‌లు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. సేవలతో పాటు విద్యార్థులు యువత కోసం వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు కూడా చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ పూర్వాద్యక్షులు సూర్య భగవాన్‌, కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డి, ప్రోగ్రామ్‌ చైర్మెన్‌ పడాల గంగాధర్‌, చింతల గంగాదాస్‌ పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, ...

Comment on the article