Breaking News

ధాన్యం డబ్బులు వేగవంతంగా చెల్లించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరుగాలం కష్టించి ధాన్యాన్ని అందించిన రైతుకు ధాన్యం డబ్బులు చెల్లించే ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో మాట్లాడారు.

రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యతను పరిశీలించి వెంట వెంట తూకం వేయడం, రైస్‌ మిల్లులకు పంపించడం, అక్కడ వెంటనే ధాన్యాన్ని దించుకునే విధంగా రైస్‌ మిల్లుల వద్ద ఏర్పాటు చేయాలని, రవాణా విషయంలో లారీల కొరత రాకుండా తగు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా రైతులు ఇచ్చిన ధాన్యం వివరాలను వెంట వెంట కొనుగోలు కేంద్రాలలో ఓపిఎమ్‌ఎస్‌లో ట్యాబ్‌ ద్వారా వివరాలు నమోదు చేసి వీలైనంత త్వరగా రైతులకు డబ్బులు అందేవిధంగా చూడాలని ఆదేశించారు.

ఇప్పటివరకు సగానికి పైగా అంటే మూడు లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం సేకరించామని 241 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామని, ఇది రాష్ట్ర స్థాయి సరాసరి కంటే పైన ఉన్నదని తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు ప్రక్రియ బాగా నడుస్తున్నదని, మరికొద్ది రోజుల్లో మరింత శ్రద్ధతో పని చేస్తే కొనుగోలు కార్యక్రమం ముగుస్తుందని పేర్కొన్నారు. సెల్‌ కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డిసిఓ సింహాచలం, డిఆర్‌డిఓ, సివిల్‌ సప్లయిస్‌ డిఎం, ఆర్‌డిఓలు, తహసీల్దార్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, ...

Comment on the article