Breaking News

నర్సరీలలో విత్తనాల పనులు వెంటనే పూర్తి చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని మున్సిపాలిటీలలో లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలలో విత్తనాలు వేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా మున్సిపాలిటీలలో హరితహారం కొరకు విత్తనాలు వేయడంపై మున్సిపల్‌ కమిషనర్లతో మాట్లాడారు.

హరితహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దష్టితో పర్యవేక్షణ చేస్తున్నారని జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలను సిద్ధం చేసుకొని వాటిల్లో వచ్చే సంవత్సరంలో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడానికి అవసరమైన సీడ్లింగ్స్‌ పూర్తి చేయడానికి బ్యాగ్‌ ఫిల్లింగ్‌ తదితర కార్యక్రమాలు పూర్తిచేయాలని ఆదేశించారు.

పూర్తి చేసిన పనులకు కూడా నిధులు చెల్లింపులు జరగాలని పేర్కొన్నారు. కమిషనర్లు ఈ విషయంలో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సెల్‌ కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ లత, మున్సిపల్‌ కమిషనర్లు, డిఆర్డిఓ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, ...

Comment on the article