రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి నష్టం కలిగించే మూడు చట్టాలను తీసుకొచ్చిందని వాటిని వెంటనే ఉపసంహరించు కోవాలని, ఈ చట్టాలు రైతాంగాన్ని దెబ్బ తీసి, బడా కార్పొరేట్లకు మేలు చేసేలా ఉన్నాయని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు. సోమవారం భిక్కనూరు మండల కేంద్రంలో రైతు గోస ధర్నా నిర్వహించి సిఎం దిష్టిబొమ్మ దగ్దం చేశారు.

అనంతరం షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుందని మోదీ ప్రభుత్వం కేసీఆర్‌ ప్రభుత్వం చెప్పుకుంటున్నదని ఇవన్నీ రైతులకు మోసం చేసే మాయమాటలేనని, దేశంలో మక్కలు పండించిన రైతులకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయని వీరు విదేశాల నుంచి మక్కలను సుంకాన్ని తగ్గించి దిగుమతి చేసుకుంటున్నారని ఇది ఎవరి ప్రయోజనాల కోసమో చెప్పాలని ప్రశ్నించారు.

వీరు తెచ్చిన చట్టాలు రైతాంగానికి ఏపాటి ఉపయోగపడేవో తెలుస్తుందని, రైతులు పండించిన పంట అకాల వర్షాలతో తడిసి పోయి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. పాలకులు మాత్రం నాంకే వాస్తె కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, ఆ తర్వాత మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం లేదని, వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని, వానలతో పంటలు నష్ట పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. మక్కలు కోనుగోలు కేంద్రం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని, సన్న రకం వడ్లకు రూ.2500 మద్దతు ధర ఇవ్వాలని, దోమపోటు రోగాలకు ప్రకతి అనావష్టి అతివష్టి వల్ల దెబ్బతిన్న పంట నష్టం జరిగిందని, పత్తి పంట నష్టం ఒక ఎకరానికి 50 వేలు రూపాయలు ఇవ్వాలని, ఒక ఎకరానికి వరికి 30 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సోనా వరి పంట దోమపోటుతో నష్టపోయిన రౖెెతు కన్నీళ్ళు తుడవాలని, వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డిలో 16న వ్యాక్సినేషన్‌

కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ...

Comment on the article