Breaking News

డిఆర్‌డిఎ పనులన్నీ వెంటనే పూర్తి కావాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నర్సరీలు, హరిత హారం, క్రిమిటోరియం, డ్రైయింగ్‌ ప్లాటుఫామ్‌ తదితర పనులన్నీ వెంటనే పూర్తి చేయటానికి అధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుండి ఎపిఓ, ఏఈపిఆర్‌లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి మండలంలో మరియు ప్రతి గ్రామపంచాయతీ వారీగా ఇచ్చిన టార్గెట్‌ను సమీక్షించారు.

రెండు రోజుల్లో ప్రతి జిపిలో మట్టిని సిద్ధం చేసుకుని బ్యాగ్‌లలో నింపుకోవాలని నవంబర్‌ చివరి వరకు సీడ్‌ ఫిల్లింగ్‌ పూర్తి కావాలని ఆదేశించారు. వచ్చే సంవత్సరానికి నర్సరీలకు సంబందించిన టార్గెట్‌ వెంటనే పూర్తి కావాలని, ఇప్పటి వరకు పంపిన బ్యాగ్స్‌ అన్ని ఫిల్‌ పూర్తి చేసి తదుపరి సీడ్‌ కూడా డిబ్లింగ్‌ కావాలని, ఒక్కవేల కాని చోట్ల 2 రోజులలో పూర్తి చేయాలన్నారు. ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో డ్రైయింగ్‌ ప్లాటుఫామ్‌లను ఒక డ్రైవ్‌ లాగా పెట్టుకొని పని చేయందన్నారు.

డ్రైయింగ్‌ ప్లాటుఫామ్‌లు మంజూరైన లబ్ధిదారులు వారం రోజుల్లోగా పని ప్రాంభించాలని, ఒకవేల పని ప్రాంభించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే వారం వరకు 50 శాతం పూర్తిచేయాలని, డిసెంబర్‌ 15 వరకు అన్ని పూర్తి చేసేవిధంగా పని చేయాలని ఆదేశించారు. క్రిమిటోరియంలు 434 పూర్తి అయినవని, 91 ఇంకా పూర్తి కాలేదన్నారు. అవి కూడా తొందరగా పూర్తి చేయాలని, పూర్తి చేయని వారిపై చర్యలుంటాయన్నారు.

క్రిమిటోరియం పనులు పూర్తి చేసిన వారికి వారంలో డబ్బులు ఇవ్వాలని, పెండింగ్‌ ఉండకూడదని ఆదేశించారు. జనశక్తి అభియాన్‌ ప్రాజెక్ట్‌లో కొన్ని పనులు తీసుకొని దానికి సంబంధించిన బెనిఫిషియర్‌ లిస్ట్‌ తయారుచేసి పంపాలని ఆదేశించారు. పల్లె ప్రకతి వనం పూర్తి చేసిన వారికి బిల్స్‌ పేమెంట్‌ కావాలని, ఎక్కడా పెండింగ్‌ పెట్టవద్దని అధికారులకు ఆదేశించారు. ప్లాంటేషన్‌ కూడా కొన్ని పెండింగ్‌ వున్నవని పెండింగ్‌ ఉన్న చోట మొక్కలు నాటి పూర్తి చేయాలని, హరిత హారం వివరాలు ఎఫ్‌టిఓ జనరేట్‌ చేయాలని కొన్ని చోట్ల నాటిన మొక్కలు కనిపించడం లేదు, కావున వాటి దగ్గర వేరే మొక్కలు పెట్టాలన్నారు.

మొక్కలు, ట్రీ గార్డ్‌ వున్నవి లేనివి ప్రతీ రోజు చూసుకోవాలన్నారు. రైతు వేదిక, క్రిమిటోరియం, పల్లె ప్రకతి వనం, హరిత హారం మొక్కలు జాగ్రత్త చూసుకోవాలని, ఒక్క మొక్క పోవద్దని, వన సేవకుల పని మొక్కలు పెంచడమే కావున మొక్కలు ఉండాలని హెచ్చరించారు.

వచ్చే సోమవారం నుండి శానిటేషన్‌ ఆప్‌ ప్రాంభించుకుందామని తెలిపారు. ఏపిఓలు గట్టిగా అనుకుంటే ప్రతి పని చేయిస్తారని, మీరు 8 నుండి 9 గంటలు పనిచేస్తే పని పూర్తి అవుతదన్నారు. ప్రతి ఒక్కరు ర్యాడా మహేష్‌ను పోల్చుకొని పని చేయందని, మాహేష్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోండని ఏపిఓలతో అన్నారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ లత, జిల్లా పరిషత్‌ సీఈవో గోవింద్‌ నాయక్‌, డిఆర్‌డిఏ పిడి శ్రీనివాస్‌, డిపిఓ జయసుధ పాల్గొన్నారు.

Check Also

21న ప్రొఫెసర్‌ శేషయ్య సంస్మరణ సభ

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పౌర హక్కుల సంఘం (సీ.ఎల్‌.సీ) నిజామాబాద్‌ జిల్లా కమిటీ ...

Comment on the article