అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, నవంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు సమగ్ర సర్వే పోర్టల్‌లో మొక్కజొన్న వేసినట్లు నమోదు చేసుకున్న రైతులకే ఏఈఓలు కూపన్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని తన చాంబర్‌లో మంగళవారం వ్యవసాయ శాఖ, ఐకేపీ, మార్క్‌ఫెడ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కూపన్ల ఆధారంగానే కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని సూచించారు.

అటవీశాఖ, దేవాదాయ శాఖ భూములలో మొక్కజొన్న పంట పండించిన రైతులకు రైతు సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకున్నట్లయితే పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణ ఇవ్వాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఏఈఓలు రైతు సమగ్ర సర్వే పోర్టల్‌లో మొక్క జొన్నలు సాగు చేసుకున్నట్లు నమోదు చేసుకున్న రైతులకే కూపన్ల నివ్వాలని సూచించారు. దళారులకు కూపన్లు ఇస్తే సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలో 35 మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఆరు కేంద్రాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నల వివరాలు, రైతు పేర్లు ప్రతిరోజు ట్యాబ్‌లో నమోదు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు సజావుగా నడిచే విధంగా వ్యవసాయ, సహకార శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు.

సమావేశంలో అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, మార్క్‌ఫెడ్‌ ఎండి రంజిత్‌ రెడ్డి, డిసిఓ శ్రీనివాస్‌, సివిల్‌ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్‌, డిఎస్‌ఓ కొండలరావు, జిల్లా మార్కెటింగ్‌ అధికారిని రమ్య, ఐకెపి డిపిఎం రమేష్‌ బాబు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డిలో రంగోళి పోటీలు

కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ...

Comment on the article