Breaking News

గోడప్రతుల ఆవిష్కరణ

నిజామాబాద్‌, నవంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబర్‌ 26న జరిగే దేశవ్యాప్త సమ్మె ప్రచార పోస్టర్లను ప్రగతిశీల కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) ఆధ్వర్యంలో మాక్లూర్‌ మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా ఇంచార్జి ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నేతత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మికుల, రైతుల, సామాన్య ప్రజల హక్కుల మీద దాడి చేస్తుందన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్న ఫలితంగా దేశంలోని 80 శాతం పైగా ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. 2019 డిసెంబర్‌లో వేతనాల కోడ్‌, 2020 సెప్టెంబర్‌లో సామాజిక భద్రత కోడ్‌, పరిశ్రమ సంబంధాల కోడ్‌, వత్తి సంబంధ ఆరోగ్య భద్రత మరియు పని పరిస్థితుల కోడ్‌ లాంటి కార్మిక ప్రజావ్యతిరేక బిల్లులు తెచ్చిందన్నారు. కొత్త కోడ్‌ వల్ల గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలు, జిఎస్‌టి సందర్భంగా పనుల లా సవరణ, మరికొన్ని చట్టాలు రద్దు అయిపోయాయన్నారు.

కార్మికులను కట్టు బానిసలుగా చేసి సంఘాలు పెట్టకుండా చెయ్యడం, సమ్మె హక్కును రద్దు చేయడం, ఇప్పటికే ఉన్న సంఘాలను కూడా పరిగణలోకి తీసుకోకపోవడం లాంటి దుర్మార్గపు విధానాలు కోడ్‌లలో పెట్టారన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త కోడ్‌, బిల్లుల వల్ల కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించుమని అడిగే హక్కు కూడా లేకుండా పోయిందని, ఇది కార్మిక వర్గానికి ఎనలేని ద్రోహం చేయడం అవుతుందన్నారు.

కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ అండ్‌ వర్కర్లకు నెలకు కనీసం 21 వేల రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ పర్మనెంట్‌ చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. కార్మికులు, రైతులు, రైతు కూలీలు మరియు మోడీ ప్రభుత్వ వ్యవసాయ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు, తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు దేశవ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ సంఘాలు నవంబర్‌ 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐ.ఎఫ్‌.టీ.యు జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, నాయకులు ఈశ్వరి, రమ, శారద, సువర్ణ, చంద్రకళ, సావిత్రి, శారద, అర్చన, విజయ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, ...

Comment on the article