Breaking News

పోలీసు కుటుంబాలకు చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, నవంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 6వ తేదీన ఎల్‌.మురళి, కానిస్టేబుల్‌ (1664) ఆత్మహత్య చేసుకుని మరణించారని, పోలీస్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో అతని కుటుంబానికి పోలీస్‌ శాఖలో గల కాని స్టేబుల్‌ నుండి పోలీస్‌ కమీషనర్‌ వరకు తమ జీతం నుండి డెత్‌ ఫండ్‌ (ఆర్థిక సహాయం) రూ.1 లక్ష 24 వేల 100 చెక్కు రూపంలో మంగళవారం పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ చేతుల మీదుగా పోలీస్‌ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్సు హాల్‌లో మురళి సతీమణి అయిన హేమలతకి అందజేసినట్టు పేర్కొన్నారు.

అదేవిధంగా జూలై 26వ తేదీన టి. రవీంధర్‌ ఎ.ఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ (256) హెడ్‌ క్వార్టర్స్‌ నిజామాబాద్‌ అనారోగ్యంతో మరణించారని, పోలీస్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో అతని కుటుంబానికి పోలీస్‌ శాఖ యందు గల కాని స్టేబుల్‌ నుండి పోలీస్‌ కమీషనర్‌ వరకు తమ జీతం నుండి డెత్‌ ఫండ్‌ (ఆర్థిక సహయం) రూ. 1 లక్ష 23 వేల 500 చెక్కును టి. రవీంధర్‌ సతీమణి నిర్మలకి అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు షకీల్‌ పాషా మరియు వారి కుటుంబ సభ్యులు హజరయ్యారు.

Check Also

కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, ...

Comment on the article