కామారెడ్డి, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన ప్రతి మొక్కను సంరక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శరత్ కోరారు. మంగళవారం తన చాంబర్లో పంచాయతీ, ఉపాధి హామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో నాటిన మొక్కలలో 85 శాతం జీవించే విధంగా చూడాలని సూచించారు.
పల్లె ప్రకతి వనంలో నాటిన మొక్కలను 100 శాతం సంరక్షణ చేయాలని పేర్కొన్నారు. మొక్కలు ఎండిపోతే సంబంధిత గ్రామాల సర్పంచ్, కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంపోస్టు షెడ్లను వినియోగంలోకి తీసుకువచ్చి పంచాయతీల ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. స్మశాన వాటికలను వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిఆర్డిఓ చంద్రమోహన్ రెడ్డి, ఇంచార్జ్ డిపిఓ సాయన్న, పంచాయతీరాజ్ డిఈ వీరా నందు, అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- రూ.50 వేల విలువచేసే గుట్కా స్వాధీనం - January 19, 2021
- టీఎస్ఐపాస్ అండ్ డిస్టిక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం - January 18, 2021
- తెలంగాణ పాడి రైతన్నకు ప్రోత్సాహక లబ్ది - January 18, 2021