పూర్తి చేసిన పనులు ఆన్‌లైన్‌ చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయడమే కాకుండా వాటిని ఆన్‌లైన్‌లో కూడా కనిపించే విధంగా నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయం నుండి సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా సంబంధిత అధికారులతో పల్లె ప్రగతి డ్రైయింగ్గ్‌ ప్లాట్‌ ఫారాల నిర్మాణం గురించి సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 416 డ్రైయింగ్‌ ప్లాట్‌ ఫారాలు పూర్తి చేసినట్లు అధికారులు నివేదికలు ఇచ్చినప్పటికీ అవి ఆన్‌లైన్‌లో ఇంకా నమోదయినట్లు కనిపించడం లేదని ఎప్పటికప్పుడు పూర్తి చేసిన పనులను అంతే ప్రాధాన్యత ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని అప్పుడే జిల్లాలో నిర్వహిస్తున్న పనులు రాష్ట్ర అధికారుల దష్టికి వెళ్లుతుందని, లేదంటే చిన్న పనులకు కూడా గుర్తింపు ఉండదని తెలిపారు.

ఏ విధంగా పల్లె ప్రగతి వనాలు ఏర్పాటు చేసే చోట స్థల సేకరణ, ఖర్చు అంచనాలు తదితర వివరాలను కూడా వెంటనే పూర్తి చేసి పనులు ప్రారంభించటానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెల్‌ కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డిఆర్‌డివో శ్రీనివాస్‌, ఏపీఎంలు, ఏపీఓలు, ఈసిలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

అనాధ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శిశు గహ, బాల సదన్‌ గహాల్లో గల అనాధ ...

Comment on the article