నిజామాబాద్, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రంలోనే ఉన్నతమైన సేవలు అందించే విధంగా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆస్పత్రి వైద్య అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారులతో ఆసుపత్రి అభివద్ధి, సదుపాయాలు, నాణ్యమైన సేవలు, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆస్పత్రికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మిషనరీ తదితర సదుపాయాలతో పాటు ఆసుపత్రి అభివద్ధికి ఇంకా ఏమేం చేయాలో కూలంకషంగా వైద్య అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. మెరుగైన సేవలు అందించడానికి కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని పూర్తి చేయటానికి కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సాధారణ సేవలతో పాటు ఆరోగ్యశ్రీ సేవలు మరింత మెరుగుపరిచి కార్పోరేట్ ఆస్పత్రులకు బదులుగా ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు వచ్చే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు.
ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన ఆదాయ వనరులపై కూడా ఆలోచించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి భవనంలో కొనసాగుతున్న నర్సింగ్ కళాశాలను మాక్లూర్‌కు తరలించి ప్రస్తుతం ఉన్న భవనాన్ని వైద్య సేవలకు ఉపయోగించాలని ఆదేశించారు. ఆసుపత్రి భవనం చిన్నచిన్న మరమ్మతులు, సివిల్ వర్క్స్, లీకేజీలు, యంత్రాలు చెడిపోతే వాటిని మరమ్మత్తు చేయించుటకు తీసుకోవాల్సిన చర్యలపై దష్టి పెట్టాలన్నారు. ఒక అజ్ఞాత దాత విరాళంగా ఇచ్చిన అంబులెన్సును కలెక్టర్ ప్రారంభించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో అందిస్తున్న మెరుగైన సేవలకుగాను తన పేరు చెప్పుకోవడం ఇష్టం లేని ఆ దాత దగ్గర ఉండి అంబులెన్సులో అవసరమైన అన్ని అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేయించాలని తాత్కాలికంగా చికిత్స అందించడానికి అవసరమైన సామాగ్రి అంబులెన్స్‌లో సమకూర్చారని ప్రజలకు అత్యవసర సమయాల్లో వాహనాన్ని పంపించటానికి వాహనం ఎంతైనా ఉపయోగకరంగా ఉంటుందని తెలుపుతూ ఆ అజ్ఞాత దాతకు అభినందనలు తెలుపుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి అభివద్ధికి మెరుగైన సేవలకు తీసుకోవాల్సిన చర్యలపై ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ ప్రతిమారాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ వెంకట్, బాaనజ్, హరీష్, సరస్వతి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరాతో పాటు డాక్టర్ విశాల్, తిరుపతి రావు, ఫరీదా, టిఎస్‌ఎంఐడిసి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021