నిజామాబాద్, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ, నవంబర్ 26న జరిగే సార్వత్రిక సమ్మెలో విద్యార్థులు పాల్గొని సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిడిఎస్యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్ కల్పన అన్నారు. బుధవారం పిడిఎస్యు ఆద్వర్యంలో నగరంలోని ఎన్ఆర్ భవన్లో సమ్మె గోడప్రతులు ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా విద్య వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని, నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి విద్యా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణను మరింతగా పెంచిందని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణను నియంత్రించాల్సిన ప్రభుత్వం ఆ వైపు చర్యలు తీసుకోకుండా వాటిని మరింతగా పెంచే విధానాలను చట్టాలను చేస్తుందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అనేక సమస్యలున్నా వాటిని పరిష్కరించకుండా లక్షల్లో ఖాళీలున్న వాటిని భర్తీ చేయకుండా, ప్రభుత్వ విద్యా సంస్థల అభివద్ధికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.
ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తూ విద్యను అందించే బాధ్యత నుండి తప్పుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఉన్న వాడికె చదువు, లేని వారికి విద్యను మొత్తంగా దూరం చేసే నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 26న జరిగే దేశ సార్వత్రిక సమ్మెకు పిడిఎస్యు సంపూర్ణ మద్దతునిస్తూ పాల్గొంటుందన్నారు. ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో విద్యార్థులు, యువత, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రణయ్, ప్రత్యూష, సాయి తేజ, అశుర, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021