డిచ్పల్లి, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని కళాశాలలోని కోర్సులకు చెందిన ఎం.ఎ., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్., ఎల్.ఎల్.బి., ఎల్.ఎల్.ఎం. సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు మరియు డిగ్రీ కోర్సులకు చెందిన బి.ఏ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ (ఎల్). ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగిన ...
Read More »Daily Archives: November 19, 2020
21న ప్రొఫెసర్ శేషయ్య సంస్మరణ సభ
నిజామాబాద్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పౌర హక్కుల సంఘం (సీ.ఎల్.సీ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎల్.సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ మాట్లాడుతూ పౌర హక్కుల సంఘం జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ శేషయ్య అక్టోబర్ 10న అనారోగ్యంతో మరణించారన్నారు. పీడిత ప్రజల హక్కుల కోసం సుదీర్ఘకాలం పనిచేసిన ప్రొఫెసర్ శేషయ్య మతి హక్కుల ఉద్యమానికి తీరని లోటన్నారు. ప్రొఫెసర్ శేషయ్య సంస్మరణ సభ పౌరహక్కుల సంఘం, తెలంగాణ, ...
Read More »మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
నిజామాబాద్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలపై అనేక చట్టాలు వచ్చాయని, వాటిపై మహిళలు అవగాహన పెంచుకోవాలని జిల్లా జడ్జి సాయి రమాదేవి అన్నారు. గురువారం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యాలయంలో అంగన్ వాడి టీచర్లకు మహిళా చట్టాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి సాయి రమాదేవి మాట్లాడుతూ మహిళ న్యాయ చట్టాలపై మహిళలు తప్పక అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గహహింస, వరకట్నం, బాల్య వివాహాల కేసులపై ...
Read More »ఇళ్ళ స్థలాలకు మోక్షమెప్పుడు
కామరెడ్డి, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీర్ఘకాలికంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాలకు మోక్షం లభించేది ఎప్పుడని, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలపై కోర్టుల్లో వేలాది పిటిషన్లు దాఖలైనప్పటికీ వాటిని ఎదుర్కొంటున్న ప్రభుత్వం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో మాత్రం కోర్టు సాకుతో కాలయాపన చేయడం సరైంది కాదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) అభిప్రాయపడింది. గురువారం మంత్రి కె.తారకరామారావుతో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన ”మీట్-ది-ప్రెస్” కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ ...
Read More »హిందూ పరిరక్షణ చట్టం కోసం మహిళ సైకిల్‌యాత్ర
కామారెడ్డి, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హిందు పరిరక్షణ చట్టం తేవాలని, దేవాదాయ శాఖ రద్దు చేసి దేవాలయాల హుండీ డబ్బును హిందూ ధర్మ పరిరక్షణకు వెచ్చించాలని డిమాండ్ చేస్తూ వేములవాడకు చెందిన సాధారణ మహిళ మధులత గత మూడు రోజుల క్రితం సైకిల్ యాత్ర చేపట్టారు. వేములవాడ నుండి డిల్లి వరకు దాదాపు 1500 కిలోమీటర్ల సైకిల్‌పై ప్రయాణించి ప్రధాని నరేంద్ర మోడికి వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళుతూ బుధవారం రాత్రి కామారెడ్డికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ...
Read More »