పిజి, యుజి పరీక్షలు

డిచ్‌పల్లి, నవంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని కళాశాలలోని కోర్సులకు చెందిన ఎం.ఎ., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్‌., ఎల్‌.ఎల్‌.బి., ఎల్‌.ఎల్‌.ఎం. సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు మరియు డిగ్రీ కోర్సులకు చెందిన బి.ఏ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ (ఎల్‌). ఇయర్‌ వైస్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగిన పీజీ మొదటి సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం విద్యార్థులు 135 మంది నమోదు చేసుకోగా 104 హాజరు, 31 మంది గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు.

మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరిగిన పీజీ మూడవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం విద్యార్థులు 318 మంది నమోదు చేసుకోగా 270 హాజరు, 48 గైర్హాజరు, యూజీ రెండవ సంవత్సరం బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం విద్యార్థులు 808 మంది నమోదు చేసుకోగా 708 హాజరు, 100 గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు.

Check Also

7 న ప్రీ రిపబ్లిక్‌ డే పరేడ్‌ – 2021 వాలంటీర్స్‌ ఎంపిక పోటీలు

డిచ్‌పల్లి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) విభాగం ...

Comment on the article