21న ప్రొఫెసర్‌ శేషయ్య సంస్మరణ సభ

నిజామాబాద్‌, నవంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పౌర హక్కుల సంఘం (సీ.ఎల్‌.సీ) నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎల్‌.సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్‌ రవీందర్‌ మాట్లాడుతూ పౌర హక్కుల సంఘం జాతీయ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ శేషయ్య అక్టోబర్‌ 10న అనారోగ్యంతో మరణించారన్నారు. పీడిత ప్రజల హక్కుల కోసం సుదీర్ఘకాలం పనిచేసిన ప్రొఫెసర్‌ శేషయ్య మతి హక్కుల ఉద్యమానికి తీరని లోటన్నారు.

ప్రొఫెసర్‌ శేషయ్య సంస్మరణ సభ పౌరహక్కుల సంఘం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఈ నెల 21న ఉదయం10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌ లింగంపల్లి,హైదరాబాద్‌ లో జరుగుతుందన్నారు.

ప్రొఫెసర్‌ జగ్‌ మోహన్‌ సింగ్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ప్రొ.కాత్యాయని విద్మహే, ప్రొ.గడ్డం లక్ష్మణ్‌ తదితరులు వక్తలుగా ఉంటారన్నారు. ప్రజాస్వామిక వాదులు, పౌరహక్కుల కార్యకర్తలు, అభిమానులు సభ జయప్రదం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో పౌర హక్కుల సంఘం జిల్లా నాయకులు జలంధర్‌, భాస్కర్‌ స్వామి పాల్గొన్నారు.

Check Also

అనాధ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శిశు గహ, బాల సదన్‌ గహాల్లో గల అనాధ ...

Comment on the article