మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలపై అనేక చట్టాలు వచ్చాయని, వాటిపై మహిళలు అవగాహన పెంచుకోవాలని జిల్లా జడ్జి సాయి రమాదేవి అన్నారు. గురువారం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యాలయంలో అంగన్‌ వాడి టీచర్‌లకు మహిళా చట్టాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి సాయి రమాదేవి మాట్లాడుతూ మహిళ న్యాయ చట్టాలపై మహిళలు తప్పక అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.

గహహింస, వరకట్నం, బాల్య వివాహాల కేసులపై చట్టాలు అమలవుతున్నాయని, వీటిపై మహిళలు తప్పక అవగాహన పెంచుకోవాలన్నారు. ఆడ పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివాహం చేసుకున్న మహిళ అత్త వారి ఇంట్లో ఆమెకు సంక్రమించే హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. ఆ ఇంటిలో కోడలుగా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలని అన్నారు.

అత్తమామలను మనం గౌరవిస్తే మన పిల్లలు వారిని గౌరవిస్తారని జడ్జి తెలిపారు. కార్యక్రమంలో న్యాయ మూర్తులు కిరణ్‌ మాహి, గౌతం ప్రసాద్‌, నర్సి రెడ్డి, బారు అడ్‌ హక్‌ చైర్మెన్‌ గోవర్ధన్‌, న్యాయ వాదులు కష్ణ నందు, మాణిక్‌ రాజ్‌, రమాదేవి, అంగన్‌వాడి టీచర్‌లు పాల్గొన్నారు.

Check Also

అనాధ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శిశు గహ, బాల సదన్‌ గహాల్లో గల అనాధ ...

Comment on the article