అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, నవంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 లోగా స్మశాన వాటికల నిర్మాణాలను పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే తెలిపారు. శుక్రవారం ఆయన జనహితలో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో అధికారులతో మాట్లాడారు. మండలాల వారీగా స్మశాన వాటికల, కంపోస్టు షెడ్ల , పల్లె ప్రకతి వనాలపై సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రకతి వనంలో 100 శాతం మొక్కలు ఉండే విధంగా చూడాలని కోరారు.

కంపోస్టు షెడ్లను వినియోగంలోకి తెచ్చి సేంద్రియ ఎరువులను తయారు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంపొందించుకోవాలని కోరారు. రైతు కలాలను త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్‌ అధికారులు, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సులో డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, ఇన్‌చార్జి డీపీవో సాయన్న, పంచాయతీరాజ్‌ ఈఈ వీర నంద రావు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు సమగ్ర సర్వే పోర్టల్‌లో మొక్కజొన్న వేసినట్లు నమోదు ...

Comment on the article