నిజామాబాద్, నవంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల నుండి సేకరించిన ధాన్యానికి వేగంగా చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్సు ద్వారా ధాన్యం సేకరణ, జరుగుతున్న కార్యక్రమాలపై, తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ధాన్యం సేకరణ ప్రక్రియ సాఫీగా, వేగంగా జరుగుతుందని అధికారులు మరియు కొనుగోలు కేంద్రాలలో సిబ్బంది బాగా పని చేస్తున్నారని తెలిపారు.
మరోవైపు తీసుకున్న ధాన్యానికి సంబంధిత రైతులకు డబ్బులు చెల్లించే విధంగా ప్రక్రియ మరింత వేగంగా జరిగే విధంగా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. ధాన్యం అందించిన రైతులకు సకాలంలో డబ్బులు ఇస్తే వారు సంతోషిస్తారని ఆయన పేర్కొన్నారు. దాన్యం రవాణాకు వాహనాల సమస్య రాకుండా చూడాలని, అదేవిధంగా రైస్ మిల్లుల వద్ద వెంట వెంట ధాన్యం దించుకునే విధంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ఇప్పటికీ చాలా సమస్యలను అధిగమించి ఈ కార్యక్రమం శాంతంగా నడుస్తున్నదని ఇంకా ఎక్కడైనా రైతులకు కానీ, ఇతర సమస్యలు కానీ ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. సెల్ కాన్ఫరెన్సులో డిసిఓ సింహాచలం, సివిల్ సప్లయిస్ డిఎం అభిషేక్ సింగ్, ఆర్డివోలు రాజేశ్వర్, శ్రీనివాస్, రవి, తహసీల్దార్లు, డిఆర్డిఓ, తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021