23 న అంతర్జాల సదస్సు

డిచ్‌పల్లి, నవంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ వారి సౌజన్యంతో ప్లాంట్స్‌ అండ్‌ ఎన్విరాన్మెంట్‌ అనే అంశంపై ఈ నెల 23 న ఒక రోజు అంతర్జాల కార్యశాల నిర్వహించనున్నట్లు విభాగాధిపతి మరియు సదస్సు కో-ఆర్డినేటర్‌ డా.అహ్మద్‌ అబ్దుల్‌ హలీంఖాన్‌ తెలిపారు.

అంతర్జాల కార్యశాలకు డా.జి.బి.జోరే, ఎస్‌ఆర్‌టిఎంయూ, నాందేడ్‌ డా.నాదఫ్‌, జియోగ్రఫీ విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోవాబీ మాలిక్‌ ఫాసిల్‌, అటవీశాఖ విభాగం, సర్‌ సయ్యద్‌ కళాశాల, కేరళ మరియు తులసి రావు, చైర్మన్‌, బయోడైవర్సిటీ బోర్డ్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రముఖ వక్తలుగా విచ్చేసి అంతర్జాల తెరపై ప్రసంగించనున్నట్లు ఆయన తెలిపారు.

కార్యశాలలో వక్ష శాస్త్ర డిగ్రీ, పీజీ విద్యార్థులు, పరిశోధకులు మరియు అధ్యాపకులు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధ్రువపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

Check Also

7 న ప్రీ రిపబ్లిక్‌ డే పరేడ్‌ – 2021 వాలంటీర్స్‌ ఎంపిక పోటీలు

డిచ్‌పల్లి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) విభాగం ...

Comment on the article