మనల్ని మనం కాపాడుకుందాం…

కామారెడ్డి, నవంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ సంవత్సరం జనవరి-2020 నుండి ఇప్పటి వరకు కేవలం ఒక దేవన్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్య 59 కాగా అందులో 30 మంది వారి విలువైన ప్రాణాలను కోల్పోగా, 94 మంది గాయపడగా వారి కుటుంబాలు కోలుకోలేని పరిస్థితులలోకి వెళ్లాయని కామారెడ్డి పోలీసు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇట్టి ప్రమాదాలలో 44 నెంబర్‌ జాతీయ రహదారి పైన 18 మంది, 11 నెంబర్‌ ఎస్‌హెచ్‌ పైన 6 మంది చనిపోగా, మిగతా 6 మంది ఇతర రోడ్లపై చనిపోయారని పేర్కొన్నారు. కావున ఇతర గ్రామాల నుండి కామారెడ్డి పట్టణానికి వచ్చే వాహనదారులు అదేవిధంగా చిన్నచిన్న రహదారులు మొదలుకొని జాతీయ రహదారుల పైన ప్రయాణించే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు.

అలాగే ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం – మనల్ని నమ్ముకొని జీవిస్తున్న కుటుంబానికి అండగా ఉందామని పిలుపునిచ్చారు.

Check Also

అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు సమగ్ర సర్వే పోర్టల్‌లో మొక్కజొన్న వేసినట్లు నమోదు ...

Comment on the article