నవంబర్‌ 26 వరకు గడువు పొడిగింపు

నిజామాబాద్‌, నవంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ కోర్సుల్లో చేరడానికి చివరి తేది నవంబర్‌ 26 వరకు పొడిగించినట్లు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌ తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు వెల్లడించారు.

ఇంటర్మీడియెట్‌, నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా ఇంటర్‌ పూర్తి చేసిన వారు, యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షల్లో 2016 నుంచి 2020 వరకు పాసైన విద్యార్థులు కూడా నేరుగా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్‌ పొందొచ్చని సూచించారు. ఇప్పటికే అడ్మిషన్‌ పొంది ఉండి వివిధ కారణాలతో సకాలంలో ట్యూషన్‌ ఫీ చెల్లించలేకపోయిన డిగ్రీ కోర్సు ద్వితీయ, తతీయ సంవత్సర విద్యార్థులు, పీజీ కోర్సుల్లో చేరి అడ్మిషన్‌ ఫీ కట్టలేక పోయిన వారు కూడా అవకాశాన్ని వినియోగించు కోవాలని తెలిపారు.

బి-టెక్‌, బి.ఫార్మసీ, కోర్సులు చదవిన విధ్యార్థులు కూడా ఓపెన్‌ వర్సిటీలో పీజీ కోర్సు ఎం.ఏ. పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, హిస్టరీ, సోషియాలజీ, ఇంగ్లీష్‌, సైకాలజీ, జర్నలిజం, కోర్సులలో అడ్మిషన్‌ పొందవచ్చని తెలిపారు. మరిన్ని పూర్తి వివరాలకు రీజినల్‌ కార్యాలయం నిజామాబాద్‌ లేదా వెబ్‌ సైట్‌ను సంప్రదించాలన్నారు.

Check Also

కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం

రెంజల్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి నష్టం కలిగించే చట్టాలను చేసి ...

Comment on the article