టీం వర్క్‌ తోనే విద్యా ప్రమాణాల మెరుగుదల

అధ్యాపకుల సమావేశంలో వైస్‌ ఛాన్స్‌లర్‌ నీతూ ప్రసాద్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొట్టమొదటి సారిగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి శనివారం ఉదయం విచ్చేసిన ఉపకులపతి, సీనియర్‌ ఐ.ఎ.ఎస్‌. అధికారిణి నీతూ కుమారి ప్రసాద్‌కు రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఘన స్వాగతం పలికారు.

పచ్చని మొక్కను, మేలైన శాలువా, చిరు జ్ఞాపిక, రంగు రంగుల పుష్పగుచ్చం వీసీకి అందజేశారు. మొదటగా వీసీ తన చాంబర్‌కు వెళ్లి కొద్ది సేపు కూర్చొని, అనంతరం డైరెక్టర్‌ ఆచార్య కనకయ్య ఆధ్వర్యంలో అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌లో కొత్తగా ఏర్పాటు చేయబడిన వివిధ అనుబంధ కళాశాలల దారి తెన్నులను తెలియజేసే సమగ్ర రూట్‌ మాప్‌ చిత్రాన్ని ఆవిష్కరించి, ప్రారంభోత్సవం చేశారు. స్వాగత కార్యక్రమంలో భాగంగా ఉపకులపతి నీతూ కుమారి ప్రసాద్‌ వివిధ విభాగాల అధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో సమావేశమయ్యారు.

సభాధ్యక్షులుగా రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం, ప్రిన్సిపల్‌ డా. చంద్రశేఖర్‌ వాసం, పీఆర్‌వో డా.వి.త్రివేణి ఉన్నారు. వివిధ కార్యాలయాల అడ్మినిస్ట్రేటీవ్‌ ఆఫీసర్స్‌, పీఠాధిపతులు, విభాగాధిపతులు, బీఓఎస్‌ చైర్మన్స్‌, ప్రొఫెసర్స్‌, అసోషియేట్‌ ప్రొఫెసర్స్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌, ఏఆర్స్‌, సూపరింటెండెంట్స్‌, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్స్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విభాగాల వారిగా, వివిధ కార్యాలయాల వారిగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్త కోర్సుల స్థాపన, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ను అభివద్ధి చేయడం, సైన్స్‌ కళాశాల ఏర్పాటు చేయడం, పరీక్షల విభాగం ఏర్పాటు చేయడం, సోషల్‌ సైన్స్‌ కాలేజ్‌ బిల్డింగ్‌ ఏర్పాటు చేయడం, స్పోర్ట్స్‌ బోర్డ్‌ స్థాపన, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, ఇండోర్‌ ప్లే గ్రౌండ్‌ స్థాపన, జిం పరికరాలు కొనుగోలు మరియు గది స్థాపన, అకడమిక్‌ కన్సెల్టెంట్స్‌కు గవర్నమెంట్‌ డ్యూటి ఐడెంటిటీ (ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు) కార్డులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగానికి ప్రొఫెషనల్‌ ఫోటో కెమెరా ఇతర పరికరాల కొనుగోలు, రెగ్యూలర్‌ అధ్యాపకులు (ప్రొఫెసర్స్‌ అండ్‌ అసోషియేట్‌ ప్రొఫెసర్స్‌) లకు కంప్యూటర్‌ లాప్‌ టాప్‌ల వితరణ, లీగల్‌ సెల్‌లో లా అండ్‌ ఆర్డర్‌ పుస్తకాలు మరియు కార్యాలయాల పునరుద్ధరణ, లా కళాశాలలో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశానుసారం మూట్‌ కోర్టు మరియు లా లైబ్రెరీల స్థాపన, లాంగ్వేజ్‌ లాబ్‌లో కంప్యూటర్స్‌ కొనుగోలు, దక్షిణ ప్రాంగణంలో కంప్యూటర్‌ ల్యాబ్‌ సౌకర్యం మరియు లైబ్రెరీ బిల్డింగ్‌, డిజిటల్‌ క్లాసెస్‌ కోసం ప్రత్యేక కంప్యూటర్‌ ల్యాబ్‌ల ఏర్పాటు, మొట్టమొదటి వీసీ ప్రొ.కాశీరాం పేరు మీదుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన మార్గానికి ప్రొ.కాశీరాం మార్గ్‌ అనే నామకరణ, కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాలలో ప్రత్యేకంగా యూపిఎస్‌ ఏర్పాటు, అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌లో సర్వర్‌ అండ్‌ నేట్‌ వర్కింగ్‌ స్థాపన, పరిశోధన మెరుగుదల కోసం పిహెచ్‌.డి. విద్యార్థులకు రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ గ్రాంట్‌ మంజూరు, ప్రధానంగా హాస్టల్‌ సెక్షన్‌లో విద్యుత్తు, మంచి నీరు, వంట సామగ్రి, తదితర పరికరాల కొనుగోలు, యూజీసీ గ్రాంట్‌లో అధ్యాపకుల పరిశోధనలకు, పబ్లికేషన్స్‌కు ఫైనాన్స్‌ అసిస్టెన్స్‌ మంజూరూ, సెనెట్‌ కమిటీ పునరుద్ధరణ, అధ్యాపకుల సిఎఎస్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి జిఓ నంబర్‌ 14 వర్తింపజేయడం వంటి అనేక అంశాలను ఆయా విభాగాల అధ్యాపకులు, అధికారులు వీసీకి వివరించారు.

అన్ని విషయాల పట్ల సానుకూలంగా స్పందించారు. చివరగా వీసీ ప్రసంగిస్తూ కలిసి కట్టుగా అధ్యాపకులందరు విద్యా ప్రమాణల మెరుగుదల కషి చేయాలని సూచించారు. టీం వర్క్‌ తో సత్ఫలితాలు సాధించ వచ్చన్నారు.

మేలు తరమైన పరిశోధనలను కొనసాగించాని కోరారు. నూతన సెలబస్‌ ప్లానింగ్‌, సైన్స్‌ రంగంలో నూతన ఆవిష్కరణలు చేపట్టి ఇతర విశ్వవిద్యాలయాల కంటే దీటుగా నిలవాలని హితవు పలికారు. ఈ సందర్బంగా వీసీ రెసిడెన్సీ ఆవరణలో తెలంగాణకు హరితహారంలో భాగంగా మామిడి మొక్క నాటారు.

Check Also

7 న ప్రీ రిపబ్లిక్‌ డే పరేడ్‌ – 2021 వాలంటీర్స్‌ ఎంపిక పోటీలు

డిచ్‌పల్లి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) విభాగం ...

Comment on the article