నిజామాబాద్, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజ్ చేసుకోవడం తదితర జాగ్రత్తలు పాటించే విదంగా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లత తెలిపారు. శనివారం కలెక్టరేట్ నుండి మెడికల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ పరీక్షలు ప్రతి పిహెచ్సిలో 25 జరిగే విధంగా చూడాలని ప్రతి ఒక్కరు మాస్కులు దరించేవిధంగా, సోషల్ డిస్టెన్స్, శానిటేషన్ వాడాలని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా ప్రతి పిహెచ్సిలో కెసిఆర్ కిట్స్ వుండేవిధంగా చర్యలు తీసుకోవాలని, ఎక్కడా కూడా కిట్స్ లేవు అని చెప్పవద్దు అని, టెస్ట్‌లు కొన్ని పిహెచ్సీలో చాలా తక్కువగా వున్నవి కావున టెస్ట్‌లు పెంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. అదేవిధంగా ముందుగా ప్రెగ్నెంట్ విమెన్ ఎంత మంది ఉన్న విషయం అంగన్వాడి సిబ్బంది వద్ద ఉంటుంది కాబట్టి వారి దగ్గర రిపోర్ట్ తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
డెలివరీకి వచ్చిన వారికి టెంట్, వాటర్, ఫుడ్ సమకూర్చాలని, ప్రతి పిహెచ్సీలో డెలివరీలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయివేట్‌లో 49 శాతం జరుగుతున్నవి, ప్రభుత్వ ఆసుపత్రిలో 51 శాతం మాత్రమే జరుగుతున్నవని, మెడికల్ ఆఫీసర్లు వెంటనే అప్లోడ్ చేయాలని, సోమవారం వరకు అన్ని పూర్తి చేయాలన్నారు.
అదేవిధంగా ఓపిలు కొన్ని పిహెచ్సీలో పెంచాలని, కావున ప్రతి ఒక్క మెడికల్ ఆఫీసర్ చొరవ తీసుకొని ఓపిలు పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్‌వో సుదర్శనమ్, డాక్టర్ అంజనా డిప్యూటీ డిఎం హెచ్ఓ, డాక్టర్ తుకారాం, డాక్టర్ నటరాజన్, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కామారెడ్డిలో విశ్వ ఆగ్రోటెక్ సేవలు - February 25, 2021
- ఎంపీ బి.బి పాటిల్‌కు ఫేమ్ ఇండియా మ్యాగజైన్ ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డ్ - February 25, 2021
- అధికారులు పాజిటివ్ థింకింగ్‌తో పని చేయాలి - February 25, 2021