రెంజల్, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి నష్టం కలిగించే చట్టాలను చేసి రైతులను కష్టాల పాలు చేస్తున్న ప్రభుత్వానికి రైతులే సరైన బుద్ధి చెప్పి కూల్చి వేస్తారని, తస్మాత్ జాగ్రత్త అని అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ హెచ్చరించారు. శనివారం రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
దేశానికే కాక ప్రపంచానికి నాగరికతను వ్యవసాయాన్ని 200 సంవత్సరాల పరాయి పాలనలో ప్రాధాన్యత ఇవ్వకుండా నల్లమందు ను పండించాలని ఒత్తిడి తెచ్చినా, తెల్లవారితో యుద్ధం చేసిన చరిత్ర మన రైతాంగానికి ఉందని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం 2014 -2018 సంవత్సరంలో అధికారంలోకి వస్తే రైతు ఆదాయం రెండింతలు చేస్తామని ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.
అచ్చే దిన్, బేటి బచావో బేటి పడావో అని చెప్పిన మోడీ బీజేపీ పాలనలో అర్ధరాత్రి కాదు పట్టపగలే మహిళలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. రైల్వే ప్రైవేటీకరణ బిఎస్ఎన్ఎల్, రక్షణ, బొగ్గు లాంటి నవరత్నాలను ప్రైవేటీకరణ చేసి అమ్మకానికి పెట్టారని ఇదేనా అచ్చే దిన్ అని ప్రశ్నించారు. ప్రజల మౌలిక సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి మోడీ దేశంలో చైనా పాకిస్తాన్ ఉగ్రవాదం మతాలు అంటూ ప్రజలను విడదీసి పాలిస్తున్నారని, ఇది ఎల్లకాలం సాగదని అన్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతుల్ని కష్టాలపాలు చేస్తున్న బిజెపి ప్రభుత్వానికి రైతులు తగిన రీతిలో గుణపాఠం చెప్పి గద్దె దించే రోజులు దగ్గరలో ఉన్నాయని ప్రభాకర్ అన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కే.గంగాధర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జి. సాయరెడ్డి, నాయకులు డి.రాజేశ్వర్, బి.మల్లేష్, పార్వతి రాజేశ్వర్, గుమ్ముల గంగాధర్, నసీర్, ఒడ్డెన్న, నాగన్నా, సాయిలు, పెద్దులు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- ఆలస్యం చేస్తే ప్రాణం పోయే అవకాశముంది - January 22, 2021
- అర్హులైన లబ్దిదారులకు గొర్రెల యూనిట్లు - January 22, 2021
- సన్మాన కార్యక్రమం రద్దు చేసుకోండి… - January 22, 2021