అనాధ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శిశు గహ, బాల సదన్‌ గహాల్లో గల అనాధ పిల్లలను జాగ్రత్తగా, బాధ్యతతో చూసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన స్త్రీ – శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిశు గహ, బాలసదన్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా పిల్లల ఆరోగ్యం, వారి మంచిచెడ్డలు, గహాల్లో వారికి అందిస్తున్న భోజనం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తల్లిదండ్రులు లేని అనాధలైన పిల్లలను మీరే తల్లిదండ్రులు అనుకొని వారికి ప్రేమను పంచాలని, వారు శారీరకంగా, మానసికంగా ఎదిగే విధంగా చూడాలని ఉద్యోగిగా కాకుండా సేవా దక్పథంతో వారికి కంటికి రెప్పలా రక్షణగా ఉండాలని సిబ్బందికి ఉద్బోధించారు. సదుపాయాలలో లోటు రాకుండా చూడాలని, మంచి భోజనం అందించాలని ఆదేశించారు. బాల సదన్‌ భవనం మరమ్మతులకు ప్రతిపాదనలు సమర్పించాలని పేర్కొన్నారు.

బాలసదన్‌లో మరింత మంది పిల్లలకు అవకాశం ఉన్నందున జిల్లాలో ఇంకా ఎవరైనా అనాధ పిల్లలు ఉంటే గుర్తించి గహంలో చేర్చుకొని వారికి కూడా అన్ని రకాల సేవలు అందించాలని సూచించారు. పిల్లలకు పండ్లు పంచిపెట్టారు. కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో హైదరాబాద్‌ విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో దొరికిన నిజామాబాద్‌కు చెందిన ఆరు సంవత్సరాల వయస్సు గల బాబు టిప్పు, నాలుగు సంవత్సరాల వయస్సు గల పాప అచిత బాలసదన్‌లో ఉంటున్నారని వారి తల్లిదండ్రులకు తెలిసేవిధంగా విస్తతంగా ప్రచారం గావించి వారి తల్లిదండ్రులకు పిల్లలను అప్పగించే విధంగా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ఝాన్సీ, డిసిపిఓ చైతన్య, హోమ్‌ సూపరింటెండెంట్‌ స్వర్ణలత, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Check Also

ధాన్యం చెల్లింపులు త్వరగా జరగాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల నుండి సేకరించిన ధాన్యానికి వేగంగా చెల్లింపులు జరిగే ...

Comment on the article