కామారెడ్డి, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, పంట నష్ట పరిహారం వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పద్మ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. కాగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
అరెస్టయిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎల్ దశరథ్, సిపిఎం జిల్లా నాయకులు వైయస్సార్ రాజశేఖర్, నరసింహులు, శ్యామల, మల్లేష్ ఉన్నారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని, డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని పేర్కొన్నారు.
చనిపోయిన రైతులకు 25 లక్షలు ఇవ్వాలని, అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక పంటను కాల్చి బూడిద చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రైతుల నుండి పంట కొనుగోలు చేయాలని, పది రోజులు గడుస్తున్నా రాత్రులు నిద్రపోతూ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు.
అలాగే రైతులకు పట్టాలు ఇవ్వాలని అదేవిధంగా బీడీ కార్మికులకు నూతన పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దశరథ్, జిల్లా నాయకులు రాజశేఖర్, ఎర్ర నర్సింలు, శ్యామల, రాజమణి, మల్లేష్, రాజు, ఎస్కే కాసిం, లక్ష్మి, భూమన్న, మల్లయ్య, నరసయ్య, రాజు, రజిత, పద్మ, లావణ్య, భాగ్య జమున 60 మంది కార్యకర్తలు పాల్గొన్నారు

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కామారెడ్డిలో విశ్వ ఆగ్రోటెక్ సేవలు - February 25, 2021
- ఎంపీ బి.బి పాటిల్‌కు ఫేమ్ ఇండియా మ్యాగజైన్ ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డ్ - February 25, 2021
- అధికారులు పాజిటివ్ థింకింగ్‌తో పని చేయాలి - February 25, 2021