Breaking News

కార్మిక సంఘాల బైక్‌ ర్యాలీ

బోధన్‌, నవంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రం మోడీ నాయకత్వంలోని బీ జే పీ పార్టీ కార్మిక వర్గానికి నష్టం చేసే చట్టాల సవరణలు చేయడాన్ని వ్యతిరేస్తూ ఆదివారం బోధన్‌ పట్టణంలో కేంద్ర కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ చేపట్టారు.

ర్యాలీ అంబేద్కర్‌ చౌరస్తా నుండి పాత బస్టాండ్‌, ప్రభుత్వ ఆసుపత్రి, పోస్టాఫీసు, రెంజల్‌ బేస్‌, తట్టికోట్‌, శక్కర్‌ నగర్‌ చౌరస్తా, శక్కర్‌ నగర్‌ చర్చ్‌, శక్కర్‌ నగర్‌, ఎన్‌.డి.ఎస్‌.ఎల్‌ ఫ్యాక్టరీ, కొత్త బస్టాండ్‌, సర్బాతి కెనాల్‌, రైల్వే గేట్‌, రాకాసి పేట్‌ మీదుగా నిర్వహించారు.

ర్యాలీలో ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి మల్లేష్‌, సీ.హెచ్‌.యాసగిరి గౌడ్‌, సీఐటీయూ నాయకులు జే.శంకర్‌ గౌడ్‌, ఏశాల గంగాధర్‌, ఐఎఫ్‌టీయూ నాయకులు పి.వరదయ్య, సాయగౌడ్‌, ఏఐటీయూసీ నాయకులు శంకర్‌, గంగాధర్‌ లతో పాటు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

గత చరిత్ర చెప్పాల్సిన బాధ్యత ఉంది

బోధన్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా బోధన్‌ 22 వార్డులో ...

Comment on the article