Breaking News

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు రోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి పరిశీలించారు. రెండవ రోజైన ఆదివారం ఆయన ప్రభుత్వ గిరిరాజ్‌ కళాశాల, ఎస్‌ఎఫ్‌ఎస్‌ విద్యాసంస్థలో పర్యటించి నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్‌ కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు, సిబ్బందితో నమోదు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను తీసుకున్న తర్వాత ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకొని వారు ఉంటే వివరాలు సేకరించి వారి ఇళ్లకు వెళ్లి వివరాలు తీసుకొని నమోదు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఎవరైనా మరణించి ఉంటే లేదా కొత్తగా వచ్చిన వారికి కానీ ఇక్కడి నుండి వేరే ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్ళిన వారు కానీ ఉంటే అన్ని వివరాలను కూడా తమ వద్ద కల ఓటర్ల జాబితాలో మార్పులు చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా వచ్చిన అన్ని దరఖాస్తులను క్షున్నంగా పరిశీలించి అర్హులైన వారి వివరాలను ఓటర్ల జాబితాలో నమోదు చేయటానికి ఆన్‌లైన్‌ చేయాలని తెలిపారు. నమోదు సందర్బంగా వివరాలు సరిగా ఉండాలని, ఉన్న వారిని తొలగించడం, లేని వారిని చేర్చడం జరుగకూడదని స్పష్టం చేశారు.

Check Also

పూర్తి చేసిన పనులు ఆన్‌లైన్‌ చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయడమే కాకుండా వాటిని ...

Comment on the article