Breaking News

రోటరీ క్లబ్‌ సేవలు అభినందనీయం

నిజామాబాద్‌, నవంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కత్రిమ కాలు ఏర్పాటు కార్యక్రమానికి కలెక్టర్‌ ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాలు లేని 150 మందికి ఉచితంగా కత్రిమంగా కాళ్లు వారి కొలతలకు అనుగుణంగా ప్రత్యేకంగా తయారుచేసి అమర్చడం ఎంతైనా అభినందనీయమన్నారు.

తద్వారా ఇంతవరకు కాళ్లు లేకుండా అవస్థలు పడుతున్న వారికి కత్రిమ కాలు ఏర్పాటు చేయడంతో వారు వారి పనులన్నీ సొంతంగా చేసుకోగలిగే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. దీన్ని ఒక దైవ కార్యంగా భావించవచ్చు అన్నారు. మనిషికి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయని, వాటికి ఎదురీదినప్పుడే జయించగలుగుతామని ప్రస్తుతం అమర్చిన కత్రిమ కాలు తోనే ధైర్యంగా ముందుకు వెళితే శరీరం కూడా అలవాటుపడి అన్ని పనులు చేసుకోవడానికి వీలు కలుగుతుందని తెలిపారు.

కత్రిమ కాలు అమర్చుకున్న ఒక వ్యక్తి తాను బురదలో దిగడం తప్ప మిగతా అన్ని పనులు చేయగలుగుతానని చెప్పడం ఇందుకు ఒక గొప్ప ఉదాహరణని తెలిపారు. రోటరీ క్లబ్‌ ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలలో ముందుకు వెళ్లాలని తద్వారా ఎందరికో స్పూర్తిమంతంగా ఉంటుందని, ఎందరి జీవితాల్లోనో కొత్తగా వెలుగులు నింపగలుగుతామని తద్వారా ఆ కుటుంబాల్లో సంతోషం వెల్లి విరుస్తుందని పేర్కొన్నారు.

ఇలాంటి సేవా కార్యక్రమాలకు తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు దర్శన్‌ సింగ్‌ సఖి, కార్యదర్శి బాబురావు, చైర్మన్‌ శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రత్యేక ఓటర్‌ నమోదు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం, ఆదివారం ...

Comment on the article