Breaking News

రక్తదానానికి యువత ముందుకు రావాలి

కామారెడ్డి, నవంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయ వైద్యశాలలో జంగంపల్లి గ్రామానికి చెందిన సిద్దిరామ్‌ రెడ్డి (75) వద్ధుడికి ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహం నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వారికి ప్రభుత్వ వైద్యశాలలో గల బ్లడ్‌ బ్యాంకులో బాలు 61 వ సారి ఓ పాజిటివ్‌ రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడారు.

ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి 5 వేల మందికి సకాలంలో రక్తాన్ని , కరోనా సమయంలో 300 యూనిట్ల రక్తాన్ని మరియు 50 మందికి ప్లాస్మా అందించి ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు. యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం, ప్లాస్మా అవసరం అయినట్లయితే 9492874006 నంబర్‌కి సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో రోగి బంధువులు, టెక్నీషియన్‌ పాల్గొన్నారు.

Check Also

వృద్ధురాలికి రక్తదానం

కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డికి చెందిన సరస్వతి (56) సంవత్సరాల వద్ధురాలికి ఆపరేషన్‌ ...

Comment on the article