కామారెడ్డి, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్ జనహితలో సోమవారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి 24 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా అదనపు కలెక్టర్ పి.యాది రెడ్డి తెలిపారు. రెవెన్యూకు సంబంధించి 10, గ్రామ పంచాయతీలకు సంబంధించి 9, మున్సిపల్ 2, ఆర్అండ్బి, ఉపాధి హామీ శాఖలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు.
వీటిలో 13 సమస్యలు తక్షణమే పరిష్కారం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 11 సమస్యలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్డిఓ చంద్రమోహన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- ప్రారంభానికి సిద్ధం చేశాం… - January 28, 2021
- పంటల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి - January 28, 2021
- చిరుధాన్యాలైన కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి - January 28, 2021