నిజామాబాద్, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టియస్ఐపాస్ అండ్ డిస్ట్రీస్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో టీఎస్ ఐ-పాస్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కౌన్సిల్ సమీక్ష సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ అన్ని అనుమతులు సక్రమంగా జరగాలని టియస్ఐపాస్ క్రింద మంజూరైన లోన్ వివరాలు టి ప్రైడ్ పాలసీ యస్పి క్రింద 3 మంది ఎస్సీలకు ట్రాక్టర్లు, గూడ్స్ లైట్ మోటార్ వెహికల్స్ 2, యల్ఎంవి గూడ్స్ క్యారియర్ 1 మంజూరు చేశారు.
టి ప్రైడ్ పాలసి యస్సి క్రింద 1 పౌల్ట్రీ ఫార్మ్ మంజూరు అయినవి, టి యస్ ప్రైడ్ పాలసీ టియస్ పి క్రింద యస్టి లకు 14 ట్రాక్టర్ అండ్ గూడ్స్ వెహికల్ 12, యల్ఎంవి గూడ్స్ కారియర్ 2 మంజూరు అయినవి, టి ప్రైడ్ పాలసీ టీఎస్ పి 1 కార్ 1 మంజూరు అయినవి, సబ్సిడీ ఎస్సీ, ఎస్టీ వారికి 35 శాతం, మహిళలకు 10 శాతం అదనంగా ఇవ్వబడుతుందని తెలిపారు.
స్టాండప్ ఇండియా కేంద్ర ప్రభుత్వ పథకంలో వ్యాపార పరంగా కాకుండా కేవలం సేవ ఉత్పత్తి రంగాలలో పరిశ్రమల స్థాపనకు ఎస్సీలు మరియు కులంతో సంబంధం లేకుండా మహిళలకు ఎటువంటి జమానత్ అవసరం లేకుండా ఇండస్ట్రీస్ శాఖ ద్వారా రూ.10 లక్షల నుండి 2 కోట్లు వరకు ఇవ్వడానికి అవకాశముందని, ఇందు కొరకు ఉత్సాహవంతులు పరిశ్రమల కేంద్రంలో గాని లేదా లీడ్ బ్యాంకు కార్యాలయంలో గానీ సంప్రదించాలని సూచించారు.
జిఎం ఇండస్ట్రీస్ సెల్ నం. 9440310432 కు కాల్ చేసి ఇతర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. సమావేశంలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ జనరల్ మేనేజర్ బాబురావు, విద్యుత్ శాఖ ఎస్ఈ సుదర్శన్, ఎస్సి, ఎస్టి కార్పొరేషన్ అధికారులు, బ్యాంక్ మేనేజర్లు, ఫైర్ డిపార్ట్మెంట్, ఐడిఎం జయ సంతోషి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- ప్రారంభానికి సిద్ధం చేశాం… - January 28, 2021
- పంటల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి - January 28, 2021
- చిరుధాన్యాలైన కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి - January 28, 2021