నిజామాబాద్, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దేశించుకున్న పనులు పూర్తి చేయడానికి లక్ష్యాలను చేరుకోవడానికి ప్రత్యేక డ్రైవ్‌లో కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్సు ద్వారా వ్యవసాయ కల్లాలు, నీటిపారుదల కెనాల్స్ డీ సిల్టింగ్, వ్యవసాయ రుణాల రెన్యువల్ ఫామ్ మెకానైజేషన్, సాక్ పిట్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ల ఏర్పాటు, ఉపాధి హామీ లేబర్ టర్న్ అవుట్ తదితర అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, డిఆర్డిఓ అధికారులు, వ్యవసాయ అధికారులు, బ్యాంకు అధికారులు తదితరులతో మాట్లాడారు.
రైతుల కోసం మంజూరు చేసిన వ్యవసాయ కల్లాలు పూర్తి చేయించుటకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పనులు జరిగేలా చూడాలని, మంజూరైన వారిలో ఎవరైనా ప్రారంభించకుంటే వారి స్థానంలో ఇతరులకు మంజూరు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని రైతులందరూ పూర్తిస్థాయిలో పంట రుణాలు పొందితే ప్రతి సంవత్సరం రూ. 2200 కోట్ల రుణాలు పొందగలుగుతారని చేసుకోవడం ద్వారా వడ్డీ రూపంగా రైతులందరికీ వంద కోట్ల రూపాయలు ఆదా అవుతుందని, రుణమాఫీకి రెన్యువల్‌కు ఎటువంటి సంబంధం లేదని రెన్యువల్ చేసుకోవడం వల్ల రుణ పరిమితి కూడా పెరుగుతోందని వడ్డీ శాతం తగ్గుతుందని రైతులకు అవగాహన కల్పించి రుణాలు పొందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
అదేవిధంగా ఫామ్ మెకానైజేషన్ దిశగా నాట్లు వేయడం పురుగుల మందు పిచికారి తదితర పనులకు యంత్రాల ఉపయోగంపై అవగాహన కల్పించి సంబంధిత కంపెనీలను పిలిపించి వాటి వినియోగంపై చేకూరే ప్రయోజనంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. యాసంగి వ్యవసాయ పనులు ప్రారంభం కావడానికి మరో నెలకు పైగా సమయం ఉన్నందున ఇరిగేషన్ కెనాల్స్‌లో డీసిల్టింగ్ పనులను చేపట్టి కెనాల్స్ సరిగా పనిచేసే విధంగా చూడాలని ఆదేశించారు.
ఈ పనులన్నీ ఈ నెల 26 నుండి మొదటి ఫేజ్‌లో ప్రత్యేక డ్రైవ్ ద్వారా చేపట్టి పది రోజుల్లోగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేయాలని స్పష్టంగా ఆదేశించారు. అదేవిధంగా రెండవ విడత ప్రత్యేక డ్రైవ్‌లో డిసెంబర్ 7 నుండి పది రోజుల పాటు నిర్వహించి వ్యక్తిగత కమ్యూనిటీ సాక్ పిట్స్ పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయుటకు ప్రత్యేకంగా కషి చేయాలని వాటితో పాటు రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ పనులను కూడా ముందుగా ప్రభుత్వ భవనాల యందు చేపట్టి అవి పూర్తయిన తర్వాత ఇతర భవనాలలో నిర్వహించాలని ఆదేశించారు.
అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద కనీసం 25 శాతం లేబర్ టర్న్ అవుట్ జరిగే విధంగా డిఆర్డిఓ అధికారులు గట్టిగా కషి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, ఇంచార్జ్ డిఆర్డిఓ శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈవో గోవింద్, డిపిఓ జయసుధ, డిసిఓ సింహాచలం, ఎల్డిఎం జయ సంతోషి, సిపిఓ శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- ప్రారంభానికి సిద్ధం చేశాం… - January 28, 2021
- పంటల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి - January 28, 2021
- చిరుధాన్యాలైన కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి - January 28, 2021